Thursday, January 13, 2011

Love in Hell.



"మా ముత్తాత మీద ఒట్టు!! ఈ కథలో ఎవరినీ ఇబ్బంది పెట్టాలని గాని బాధ పెట్టాలని గాని ఒక్క అక్షరం కూడా రాయలేదు."

ముందు మాట: ఈ కథ mahesh ఖలేజ సినిమాలో మహేష్ బాబు తన కథని సునీల్ కి వివరించే ఘట్టం ఆదారంగా రాసిన వ్యంగ్య రచన..
..........................................................................................................................................................................
ప్రారంభానికి  ముందు.. స్మశానంలో ప్రేమ కథలు అనే T.V program కోసం ఒక రాత్రి డైరెక్టర్ బాబ్జి తన యూనిట్ తో స్మశానానికి వెళతాడు. అక్కడ సమాధిలో నుంచి ఒక వ్యక్తి పైకి లేవడంతో యూనిట్ మెంబర్స్ పారిపోతారు. బాబ్జి షాక్ లో ఉండిపోతాడు .
రాజు: దీనెమ్మ నేనింటి సమాధిలోంచి లేచాను..కొంపదీసి నేను దెయ్యాన్నా?
బాబ్జి: (భయంతో..)ఆ మాట నన్నుడుగుతారేంటి?
రాజు: చచ్చాక ఇక్కడికి తీసుకోస్తారని తెలుసు గాని..ఇక్కడికొస్తే చస్తామని తెలీదు బయ్యా..
బాబ్జి: అసలు మీరెవరు? ఇక్కడికి ఎందుకొచ్చారు?
రాజు: అద్దె కట్టలేదని ఓనర్ రూం ఖాళి చేయుంచాడు బయ్య..ఇక్కడేమైన రూం దొరుకుతుందేమో అని వెతుకుతున్నా..

బాబ్జి: ఒక్క సమాదానమైన సరిగ్గా చెప్పండి సార్..భయంగా ఉంది..
రాజు: బయమెందుకు బాబ్జి రా..అలా..సమాధుల మద్యలోకి వెళ్లి మాట్లాడుకుందాం..
         వెళ్ళే దారిలో ..
రాజు: ఏంటి బయ్య సెల్ ఫోన్ తో షూటింగా?
బాబ్జి: స్టూడియో నష్టాల్లో ఉంది సార్..చైర్మన్ కష్టాల్లో  ఉన్నాడు..T.R.P పెంచడానికి ఏదైనా కొత్త ప్రోగ్రాం చెయ్యమంటే వెరైటీగా ఉంటుందని స్మశానంలో ప్రేమకథలు అనే ఐడియా ఇచ్చాను.. నా సెల్ ఫోన్ లోనే   షూట్ చేసుకురమ్మన్నారు..
రాజు: ఇక్కడ కూర్చుందాం బయ్య..సిగిరెట్ తాగుతావా? అని అందిస్తుంటే..
బాబ్జి: నేను సిగిరెట్ కాల్చాలంటే చాయ్ కాని మందు కాని ఉండాలి సార్..
రాజు: ఇక్కడ ఆ రెండు దొరకటం కష్టం కాని బ్లడ్ దొరుకుతుందేమో ట్రై చెయ్యమంటావ?
బాబ్జి బయపడి సిగిరెట్ తీసుకొని  వెలిగించాడు..
బాబ్జి: మీ గురించి చెప్పండి సార్..
రాజు: మనకి అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య, అన్ని ముత్తాతే బయ్య..అయన వయసు వంద..స్టిల్ బ్యాటింగ్..
బాబ్జి..హ..!!!
రాజు: డబల్ మీనింగ్ లో అర్థం చేసుకోకు బయ్య..నా ఉద్దేశం స్టిల్ లివింగ్ అని..
బాబ్జి:ఓహ్..
రాజు: నేను ఇంజనీరింగ్ పూర్తి చేసేసరికి software field లో recession బయ్య ..
బాబ్జి: bad time!!
రాజు: అవును బయ్య..ఆ టైం లో కలిసాను తనని..నాలుగే నాలుగు చోట్ల కలిసాను..జీవితం సర్వనాశనమై ఇలా సమాధుల్లో పడ్డాను..తన పేరు ..శివ నాగ వెంకట లక్ష్మి శ్రీదేవి. 

ఫస్ట్ మీటింగ్ : అదేదో  సోషల్ నెట్ వర్కింగ్ సైట్ బయ్యా....లాకెట్టో... జాకెట్టో ..
బాబ్జి: ఆర్కుట్ సార్..
రాజు: హ..అదే అదే..అందులో మధ్యాహ్నం నిద్ర లేచేవాల్లకి ఆలస్యం అని ఒక కమ్యూనిటీ ఉంది బయ్య..ఒకరోజు అందులో గుడ్ నూన్ అనే దారం లోకి ..
బాబ్జి: you mean thread..
రాజు: అదేలే బయ్య..అందులోకి ఎంటర్ అయ్యాను.."jus wok up,ny1 thr? అని ఉత్తరం..వెంటనే కొత్త కిటికిలో తన ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసాను..అమ్మాయు అచ్చం నార్త్ నుంచి సౌత్ కొచ్చిన హీరోయిన్ లా ఉంది..వెంటనే ..I am..అని రిప్లై ఇచ్చాను..whats ur name?....raju..yours....అలా మా పరిచయం ఆలస్యంలో అయునా..మేం త్వరగానే క్లోజ్ అయ్యాం..
బాబ్జి..oh..interesting..తర్వాత ?
రాజు: ఆ తర్వాత ఒకటే ముక్కలు బయ్య..
బాబ్జి; హ..
రాజు: అదే బయ్య..scraps .. వాటిల్లో తెగ మాట్లాడుకొనే వాళ్ళం..ఒక రోజయుతే వంద ముక్కలు పంపాను..
బాబ్జి: ఎందుకు సార్?
రాజు: ఆ రోజుకి మేం కలిసి వంద రోజులయుంది..
బాబ్జి: celebrations!!great..
raju: తన  ప్రొఫైల్ visitors లో  ప్రతి  రోజూ  నా  పేరు  display అయ్యేది ..
బాబ్జి: తను మంచి అందగత్తె అనుకుంట..
రాజు: స్టొరీ పూర్తిగా వినకుండ కాంప్లిమెంట్స్ ఇవ్వకు బయ్య..దెబ్బయు పోతావ్..
బాబ్జి: ఓకే ఓకే..చెప్పండి..
రాజు: ఒక రోజు రోడ్ మీద వెళ్తూ ఒక కొత్త సినిమా పోస్టర్లో హీరోయిన్ ని చూసి షాక్ అయ్యాను..
బాబ్జి: ఎందుకు సార్.. మేకప్ లేదా? రాజు సీరియస్ గా  చూడడంతో..బాబ్జి: ఓకే ఓకే..చెప్పండి..
రాజు: నేను రోజు మాట్లాడే అమ్మాయు ప్రొఫైల్ ఫోటో ఆ పోస్టర్లో హీరోయిన్ ఫోటో ఒకటే..
బాబ్జి: ఓహ్..అంటే మీరు ఇన్ని రోజులు ముక్కలు పంచుకుంది..ఒక హీరోయిన్ తోన?
రాజు: కాదు బయ్య..ఆ ఫోటో పెట్టుకున్న..శివ నాగ వెంకట లక్ష్మి శ్రీదేవితో..ఆ హీరోయిన్ ఫోటో తనది కాదని తెలియగానే నాలోని హీరో చచ్చిపోయాడు..వెంటనే ఎకౌంటు ముసేసాను..
బాబ్జి: very sad sir..

సెకండ్ మీటింగ్ :
రాజు: Facebook ...అందులో ఒక ఆప్షన్ ఉంటుంది బయ్య..గోకడం అని..
బాబ్జి: సార్ అది Poke ..
రాజు: అదేలే బయ్య...గోకడం..
బాబ్జి: వినడానికి అసహ్యం గా ఉంది సార్..
రాజు: అనడానికి సౌకర్యం గా ఉంది బాబ్జి..
         facebook లో ఒకరోజు ఒకమ్మాయు నన్ను గోకింది బాబ్జి..facebook లో ఫొటోస్ ఈనాడు క్యాలెండరు సైజు లో పెద్దగా ఉంటాయు ..ఆ సైజు ఫోటోలో ఉన్న ఆ అందమైన అమ్మాయుని  చూసి ఈ పిల్ల నన్నెందుకు గోకిందో అనుకోని తిరిగి గోకాను..అలా ఒకరినొకరం గోక్కున్నాక నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను.తను వెంటనే accept చేసింది..ముందు జాగ్రత్తగా ప్రొఫైల్ ఫోటోలో ఉంది మీరేనా? అని మెసేజ్ ఇచ్చాను..నేనే అని రిప్లై ఇచ్చింది..ప్రొఫైల్ నేమ్ శివి అని ఉంది..
బాబ్జి: అదేం పేరు సార్?
రాజు: బహుశా వాళ్ళ నాన్న అబ్బాయు పుడితే శివ అని పేరు పెట్టాలి అనుకోని అమ్మాయు పుట్టడంతో ఇలా పెట్టాడేమో
          అనుకున్నాను  బయ్య....పెద్దగా క్లారిటీ లేదు..
బాబ్జి: ఓహ్..ఓకే.ఓకే..
రాజు: ఒకరోజు సడన్ గా చాట్ లో కలిసింది..అప్పుడే నాకో నిజం తెలిసింది....ఫుల్ క్లారిటీ వచ్చింది.
బాబ్జి: ఏంటి సర్ అది?
 రాజు: శివ నాగ వెంకట లక్ష్మి శ్రీదేవి..షార్ట్ కట్ లో శివి అని...
 బాబ్జి: ఓహ్..అవునా..అప్పుడు మీరేం చేసారు?
రాజు:ఆర్కుట్ లో  ఆ నార్త్ హీరోయిన్ ఫోటో ఎందుకు పెట్టుకుందో తెలీదు కాని...శివి ఆ హీరోయిన్ కంటే చాలా అందంగా ఉంటుంది బయ్య..
దాంతో..మళ్లీ మా పరిచయం మొదలైంది..గోకడాలు, గోడల మీద గీకడాలు, చాట్ లో మాటలు కలపడాలు..ఇలా కొన్ని రోజులు బలే గడిచాయు బయ్య..
 బాబ్జి: తర్వాత?

రాజు: Facebook విశాలంగా ఉంటుంది బాబ్జి తను అంటే విశాల హృదయం..అప్పటికే తనకి 5000 మంది  ఫ్రెండ్స్..ఎవడు రిక్వెస్ట్ పంపినా accept చేసేది..ఫిగర్ బాగుంటే గోకేవాల్లకి కరువా..బాబ్జి..రోజు రోజుకి తన ఫ్రెండ్స్ లిస్టు  పెరిగిపోతూ ఉండేది..
తను ఫోటో upload చేస్తే నేను చూసేలోపే 1000 comments ఉండేవి..
బాబ్జి: ఓహ్..
రాజు: తన గోడ మీద :P  అని రాస్తే చాలు..:p:p, :) :^D, :-)), %-),:-C...ఇలా రకరకాల గుర్తులు రాసేవాళ్ళు..నాకు తిక్క రేగేది..
బాబ్జి: ఎందుకు సార్ ..ఆ గుర్తులకి అర్థం తెలిదా?
రాజు: తెలుసు బాబ్జి..
బాబ్జి: అయుతే మీరు ఒక గుర్తు రాయకపోయార?
రాజు: నేను నీలా గోవిందం బ్యాచ్ కాదు బాబ్జి..
తను స్టేటస్ మారిస్తే చాలు బెల్లం చుట్టూ ఈగల్లా అక్కడే ఉండేవాళ్ళు..
బాబ్జి: సార్ నాకొకటి అర్థమైంది..మీరు ఆ అమ్మాయుని ఇష్టపడ్డారు..అందుకే మీకు jealousy ..
రాజు: థాంక్స్ బాబ్జి ఫస్ట్ టైం బ్రెయిన్ use చేసావ్!!
దానికి తోడు బర్గర్ గాడికి డబ్బు మీద ఆశ ఎక్కువై రోజుకో application దించేవాడు..
బాబ్జి: ఈ బర్గర్ ఎవడు సార్..
రాజు: mark zuckerberg బయ్య .. ఆ అప్లికేషన్స్ బయంకరంగా ఉండేవి..అందులో who loves you today అని ఒక అప్లికేషను తను రోజు ఓపెన్ చేసేది..ప్రతి రోజు ఎవడెవడో పేర్లు వచ్చేవి..నా పేరు ఒక్క రోజు కూడా రాలేదు బయ్య..
బాబ్జి: very sad సార్ ..
రాజు: అందులో ఒకడి పేరు repeat గా వచ్చేది..అది నిజం అనుకొని వాడికి ఎక్కడ కమిట్ అయుపోతుందో అని భయం వేసేది..
బాబ్జి: ఉరుకొండి సార్ మీవన్నీ అనవసరపు భయాలు..
రాజు: ప్రేమలో భయం ఉంటుంది బాబ్జి..
బాబ్జి: ఇంతకు ముందు ఇష్టం అన్నారు..
రాజు: అదే ఇప్పుడు ప్రేమ బాబ్జి...
బాబ్జి: మరి మీ ప్రేమని ఆమెకి చెప్పారా?
అంత competition లో నేను participate చెయ్యలేకపోయాను బాబ్జి..FACEBOOK  కి goodbye చెప్పేసాను ..

థర్డ్ మీటింగ్ : C3 లో బయ్య..
బాబ్జి: ఏంటి సార్ అది రోడ్ no ?
రాజు: కాదు బాబ్జి ..నోకియా సెల్ ఫోన్ మోడల్ no..కొనేటప్పుడు నేను నీలాగే ఫీల్ అయ్యాను..
బాబ్జి: మీ నెంబర్ తనకేల తెలిసింది?
రాజు: నాకు అదే  డౌట్  వచ్చింది బయ్య..కాని అందమైన అమ్మాయు ఫోన్ చేస్తే మాట్లడాలే గాని ఇలాంటి లఫూట్ ప్రశ్నలు అడగకూడదని మా ముత్తాత చెప్పేవాడు..
బాబ్జి: ఆయనింకా ఉన్నాడా!!?
రాజు సీరియస్ గా  చూసాడు..బాబ్జి: అదే బయ్య ఇంకా కథలో ఉన్నాడా అని అడిగాను..ఓకే  ఓకే ..తర్వాత .
రాజు: తన వాయిస్ సూపర్ గా ఉంటుంది బయ్య..శ్రేయ ఘోషల్ వాయిస్ ని, చిన్మయు వాయిస్ ని  fridge  లో పెట్టి రెండు గంటల తర్వాత తీస్తే ...బాబ్జి: జలుబు చేస్తుంది సార్............సారీ...చెప్పండి..
రాజు: అంత మంచి వాయిస్ తనది..మళ్లీ మామూలే బయ్య..ప్రేమలో ..మెసేజ్ ఆఫర్స్ ..నైట్ callings...inbox full..sent box full..charging out..ఇలా కొన్ని రోజులు మామూలే..
తర్వాతే మాట్లాడుతుంటే వేరే కాల్ వస్తుంది అని కట్ చేసేది.నాకు పిచ్చ కోపం వచ్చేది ...ఎప్పుడు కాల్ చేసినా engage వచ్చేది..నాకేమో అనుమానం వచ్చేది..మెసేజ్ కి రిప్లై ఇచ్చేది కాదు...సడన్ గా నెంబర్ మార్చేది..
నాకు irritation ...aggravation... frustration......envy..ego..fear.....pain..  అలా అన్ని ఒకే సారి వచ్చేవి..
బాబ్జి: ప్రేమలో ఇన్ని Side effects ఉంటాయని తెలిదు సార్..
రాజు: నాకు ప్రేమించే వరకు తెలిదు బాబ్జి..పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయో  లేదో తెలీదు గాని..ప్రేమ మాత్రం నరకంలోనే పుడుతుందని అర్థమయుంది..
బాబ్జి: తర్వాత ఏమైంది సార్..
రాజు: తనని మరచిపోవాలని డిసైడ్ అయ్యాను..ఇంతలో recession పోయుంది ..

బాబ్జి: మీకు జాబ్ వచ్చిందా?
రాజు: తనకి వచ్చిందని తెలిసింది..దాంతో కసిగా interview కి  అటెండ్  అయ్యాను ..సోషల్ నెట్ వర్కింగ్ లో పడి సబ్జెక్టు దొబ్బింది..ఇంటర్వ్యూ లో సెలెక్ట్ కాలేదు...చాలా మందికి నా కథ చెప్పాను..అందరూ బాధపడ్డారే కాని ఎవడూ నా బాధని అర్థం చేసుకొని జాబ్ ఇవ్వలేదు..
 బాబ్జి: ఇప్పుడు ఆ అమ్మాయు ఏం చేస్తుంది సార్..
రాజు: పెళ్లి చేసుకొని  పిల్ల పాపలతో హయుగా ఉంది బాబ్జి..
బాబ్జి: చాలా బాధగా ఉంది సర్....
రాజు: హ..హమ్...అని సిగిరెట్ వెలిగించాడు..
బాబ్జి: ఆమె husband ఏమి చేస్తుంటాడు సర్..
రాజు: వాడొక పెద్ద ఎదవ బాబ్జి..ఉద్యోగం లేదు..పగలంతా ఇంట్లో తిని తొంగుంటాడు..చీకటి పడ్డాక ఇలా స్మశానంలో తిరుగుతుంటాడు..
బాబ్జి: సార్...........అంటే.....మీరే ఆమె భర్త..!!
రాజు: అవును బాబ్జి..
బాబ్జి: ఓహ్..మై గాడ్..అంత Negative situations నుంచి మళ్లీ ఎలా కలిసారు సర్..
రాజు: Relationships ఎప్పుడూ negatives నుంచే డెవలప్ అవుతాయు బాబ్జి..ఫొటోస్ లాగా..
ప్రేమించిన వ్యక్తిని మనం ఎంత మరిచిపోవాలనుకుంటే వాళ్ళు అంత గుర్తొస్తారు..అలా తనకి నేను గుర్తొచ్చి ఫోన్ చేసింది..
బాబ్జి:  అంటే తను మిమ్మల్ని ప్రేమించిందా?
రాజు: అవును బయ్యా..నేను తన relationships గురించి ఎలా బయపడ్డానో తను నా relationships విషయంలో అలానే బయపడింది..సోషల్ నెట్ వర్కింగ్ లో ప్రాబ్లం అదే బయ్యా..ఏ ఇద్దరి relationship గురించి మూడో వాడికి పూర్తిగా తెలీదు.దాంతో ఏదేదో ఊహించుకుంటారు...అందుకే మా ఇద్దరి మద్య గ్యాప్..infact ఇదే  కథని తన point of view లో చెప్తే..తను..నేను..నేను..తను..
మర్చిపోయాను మా ఫోర్త్ మీటింగ్ కళ్యాణ మండపంలో.. 
బాబ్జి: total negative story చెప్పి ఫైనల్ లో బలే పాజిటివ్ ట్విస్ట్ ఇచ్చారు సార్..
రాజు: నేనంతే భయ్యా..ఎంత negative story అయునా పాజిటివ్ ఎండింగ్ ఇవ్వడానికే ఇష్టపడతాను..
 ముగింపు తర్వాత ..స్మశానంలో నుంచి వెళ్ళిపోతూ..
బాబ్జి: అన్ని చెప్పారు..ఆ సమాధి లో నుంచి ఎలా లేసారో చెప్పండి సర్..
రాజు: నేను సమాధిలోంచి లేవలేదు బాబ్జి..సమాధి పక్కనుంచి లేచాను..అది మా ముత్తాత సమాధి..ఈ  మధ్యే ఆయన పోయారు..
బాబ్జి..I'm Sorry sir..
రాజు: its ok baabji..
ఫైనల్ గా నేకొకటి చెప్పనా..ప్రేమలు నరకంలోనే పుడతాయు..ఆ ప్రేమని పెళ్లితో స్వర్గం అనే ప్లేస్ కి మనమే తీసుకెళ్ళాలి..లేదంటే ప్రేమ నరకం లోనే ఉండిపోతుంది..