Thursday, January 13, 2011

Love in Hell.



"మా ముత్తాత మీద ఒట్టు!! ఈ కథలో ఎవరినీ ఇబ్బంది పెట్టాలని గాని బాధ పెట్టాలని గాని ఒక్క అక్షరం కూడా రాయలేదు."

ముందు మాట: ఈ కథ mahesh ఖలేజ సినిమాలో మహేష్ బాబు తన కథని సునీల్ కి వివరించే ఘట్టం ఆదారంగా రాసిన వ్యంగ్య రచన..
..........................................................................................................................................................................
ప్రారంభానికి  ముందు.. స్మశానంలో ప్రేమ కథలు అనే T.V program కోసం ఒక రాత్రి డైరెక్టర్ బాబ్జి తన యూనిట్ తో స్మశానానికి వెళతాడు. అక్కడ సమాధిలో నుంచి ఒక వ్యక్తి పైకి లేవడంతో యూనిట్ మెంబర్స్ పారిపోతారు. బాబ్జి షాక్ లో ఉండిపోతాడు .
రాజు: దీనెమ్మ నేనింటి సమాధిలోంచి లేచాను..కొంపదీసి నేను దెయ్యాన్నా?
బాబ్జి: (భయంతో..)ఆ మాట నన్నుడుగుతారేంటి?
రాజు: చచ్చాక ఇక్కడికి తీసుకోస్తారని తెలుసు గాని..ఇక్కడికొస్తే చస్తామని తెలీదు బయ్యా..
బాబ్జి: అసలు మీరెవరు? ఇక్కడికి ఎందుకొచ్చారు?
రాజు: అద్దె కట్టలేదని ఓనర్ రూం ఖాళి చేయుంచాడు బయ్య..ఇక్కడేమైన రూం దొరుకుతుందేమో అని వెతుకుతున్నా..

బాబ్జి: ఒక్క సమాదానమైన సరిగ్గా చెప్పండి సార్..భయంగా ఉంది..
రాజు: బయమెందుకు బాబ్జి రా..అలా..సమాధుల మద్యలోకి వెళ్లి మాట్లాడుకుందాం..
         వెళ్ళే దారిలో ..
రాజు: ఏంటి బయ్య సెల్ ఫోన్ తో షూటింగా?
బాబ్జి: స్టూడియో నష్టాల్లో ఉంది సార్..చైర్మన్ కష్టాల్లో  ఉన్నాడు..T.R.P పెంచడానికి ఏదైనా కొత్త ప్రోగ్రాం చెయ్యమంటే వెరైటీగా ఉంటుందని స్మశానంలో ప్రేమకథలు అనే ఐడియా ఇచ్చాను.. నా సెల్ ఫోన్ లోనే   షూట్ చేసుకురమ్మన్నారు..
రాజు: ఇక్కడ కూర్చుందాం బయ్య..సిగిరెట్ తాగుతావా? అని అందిస్తుంటే..
బాబ్జి: నేను సిగిరెట్ కాల్చాలంటే చాయ్ కాని మందు కాని ఉండాలి సార్..
రాజు: ఇక్కడ ఆ రెండు దొరకటం కష్టం కాని బ్లడ్ దొరుకుతుందేమో ట్రై చెయ్యమంటావ?
బాబ్జి బయపడి సిగిరెట్ తీసుకొని  వెలిగించాడు..
బాబ్జి: మీ గురించి చెప్పండి సార్..
రాజు: మనకి అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య, అన్ని ముత్తాతే బయ్య..అయన వయసు వంద..స్టిల్ బ్యాటింగ్..
బాబ్జి..హ..!!!
రాజు: డబల్ మీనింగ్ లో అర్థం చేసుకోకు బయ్య..నా ఉద్దేశం స్టిల్ లివింగ్ అని..
బాబ్జి:ఓహ్..
రాజు: నేను ఇంజనీరింగ్ పూర్తి చేసేసరికి software field లో recession బయ్య ..
బాబ్జి: bad time!!
రాజు: అవును బయ్య..ఆ టైం లో కలిసాను తనని..నాలుగే నాలుగు చోట్ల కలిసాను..జీవితం సర్వనాశనమై ఇలా సమాధుల్లో పడ్డాను..తన పేరు ..శివ నాగ వెంకట లక్ష్మి శ్రీదేవి. 

ఫస్ట్ మీటింగ్ : అదేదో  సోషల్ నెట్ వర్కింగ్ సైట్ బయ్యా....లాకెట్టో... జాకెట్టో ..
బాబ్జి: ఆర్కుట్ సార్..
రాజు: హ..అదే అదే..అందులో మధ్యాహ్నం నిద్ర లేచేవాల్లకి ఆలస్యం అని ఒక కమ్యూనిటీ ఉంది బయ్య..ఒకరోజు అందులో గుడ్ నూన్ అనే దారం లోకి ..
బాబ్జి: you mean thread..
రాజు: అదేలే బయ్య..అందులోకి ఎంటర్ అయ్యాను.."jus wok up,ny1 thr? అని ఉత్తరం..వెంటనే కొత్త కిటికిలో తన ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసాను..అమ్మాయు అచ్చం నార్త్ నుంచి సౌత్ కొచ్చిన హీరోయిన్ లా ఉంది..వెంటనే ..I am..అని రిప్లై ఇచ్చాను..whats ur name?....raju..yours....అలా మా పరిచయం ఆలస్యంలో అయునా..మేం త్వరగానే క్లోజ్ అయ్యాం..
బాబ్జి..oh..interesting..తర్వాత ?
రాజు: ఆ తర్వాత ఒకటే ముక్కలు బయ్య..
బాబ్జి; హ..
రాజు: అదే బయ్య..scraps .. వాటిల్లో తెగ మాట్లాడుకొనే వాళ్ళం..ఒక రోజయుతే వంద ముక్కలు పంపాను..
బాబ్జి: ఎందుకు సార్?
రాజు: ఆ రోజుకి మేం కలిసి వంద రోజులయుంది..
బాబ్జి: celebrations!!great..
raju: తన  ప్రొఫైల్ visitors లో  ప్రతి  రోజూ  నా  పేరు  display అయ్యేది ..
బాబ్జి: తను మంచి అందగత్తె అనుకుంట..
రాజు: స్టొరీ పూర్తిగా వినకుండ కాంప్లిమెంట్స్ ఇవ్వకు బయ్య..దెబ్బయు పోతావ్..
బాబ్జి: ఓకే ఓకే..చెప్పండి..
రాజు: ఒక రోజు రోడ్ మీద వెళ్తూ ఒక కొత్త సినిమా పోస్టర్లో హీరోయిన్ ని చూసి షాక్ అయ్యాను..
బాబ్జి: ఎందుకు సార్.. మేకప్ లేదా? రాజు సీరియస్ గా  చూడడంతో..బాబ్జి: ఓకే ఓకే..చెప్పండి..
రాజు: నేను రోజు మాట్లాడే అమ్మాయు ప్రొఫైల్ ఫోటో ఆ పోస్టర్లో హీరోయిన్ ఫోటో ఒకటే..
బాబ్జి: ఓహ్..అంటే మీరు ఇన్ని రోజులు ముక్కలు పంచుకుంది..ఒక హీరోయిన్ తోన?
రాజు: కాదు బయ్య..ఆ ఫోటో పెట్టుకున్న..శివ నాగ వెంకట లక్ష్మి శ్రీదేవితో..ఆ హీరోయిన్ ఫోటో తనది కాదని తెలియగానే నాలోని హీరో చచ్చిపోయాడు..వెంటనే ఎకౌంటు ముసేసాను..
బాబ్జి: very sad sir..

సెకండ్ మీటింగ్ :
రాజు: Facebook ...అందులో ఒక ఆప్షన్ ఉంటుంది బయ్య..గోకడం అని..
బాబ్జి: సార్ అది Poke ..
రాజు: అదేలే బయ్య...గోకడం..
బాబ్జి: వినడానికి అసహ్యం గా ఉంది సార్..
రాజు: అనడానికి సౌకర్యం గా ఉంది బాబ్జి..
         facebook లో ఒకరోజు ఒకమ్మాయు నన్ను గోకింది బాబ్జి..facebook లో ఫొటోస్ ఈనాడు క్యాలెండరు సైజు లో పెద్దగా ఉంటాయు ..ఆ సైజు ఫోటోలో ఉన్న ఆ అందమైన అమ్మాయుని  చూసి ఈ పిల్ల నన్నెందుకు గోకిందో అనుకోని తిరిగి గోకాను..అలా ఒకరినొకరం గోక్కున్నాక నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను.తను వెంటనే accept చేసింది..ముందు జాగ్రత్తగా ప్రొఫైల్ ఫోటోలో ఉంది మీరేనా? అని మెసేజ్ ఇచ్చాను..నేనే అని రిప్లై ఇచ్చింది..ప్రొఫైల్ నేమ్ శివి అని ఉంది..
బాబ్జి: అదేం పేరు సార్?
రాజు: బహుశా వాళ్ళ నాన్న అబ్బాయు పుడితే శివ అని పేరు పెట్టాలి అనుకోని అమ్మాయు పుట్టడంతో ఇలా పెట్టాడేమో
          అనుకున్నాను  బయ్య....పెద్దగా క్లారిటీ లేదు..
బాబ్జి: ఓహ్..ఓకే.ఓకే..
రాజు: ఒకరోజు సడన్ గా చాట్ లో కలిసింది..అప్పుడే నాకో నిజం తెలిసింది....ఫుల్ క్లారిటీ వచ్చింది.
బాబ్జి: ఏంటి సర్ అది?
 రాజు: శివ నాగ వెంకట లక్ష్మి శ్రీదేవి..షార్ట్ కట్ లో శివి అని...
 బాబ్జి: ఓహ్..అవునా..అప్పుడు మీరేం చేసారు?
రాజు:ఆర్కుట్ లో  ఆ నార్త్ హీరోయిన్ ఫోటో ఎందుకు పెట్టుకుందో తెలీదు కాని...శివి ఆ హీరోయిన్ కంటే చాలా అందంగా ఉంటుంది బయ్య..
దాంతో..మళ్లీ మా పరిచయం మొదలైంది..గోకడాలు, గోడల మీద గీకడాలు, చాట్ లో మాటలు కలపడాలు..ఇలా కొన్ని రోజులు బలే గడిచాయు బయ్య..
 బాబ్జి: తర్వాత?

రాజు: Facebook విశాలంగా ఉంటుంది బాబ్జి తను అంటే విశాల హృదయం..అప్పటికే తనకి 5000 మంది  ఫ్రెండ్స్..ఎవడు రిక్వెస్ట్ పంపినా accept చేసేది..ఫిగర్ బాగుంటే గోకేవాల్లకి కరువా..బాబ్జి..రోజు రోజుకి తన ఫ్రెండ్స్ లిస్టు  పెరిగిపోతూ ఉండేది..
తను ఫోటో upload చేస్తే నేను చూసేలోపే 1000 comments ఉండేవి..
బాబ్జి: ఓహ్..
రాజు: తన గోడ మీద :P  అని రాస్తే చాలు..:p:p, :) :^D, :-)), %-),:-C...ఇలా రకరకాల గుర్తులు రాసేవాళ్ళు..నాకు తిక్క రేగేది..
బాబ్జి: ఎందుకు సార్ ..ఆ గుర్తులకి అర్థం తెలిదా?
రాజు: తెలుసు బాబ్జి..
బాబ్జి: అయుతే మీరు ఒక గుర్తు రాయకపోయార?
రాజు: నేను నీలా గోవిందం బ్యాచ్ కాదు బాబ్జి..
తను స్టేటస్ మారిస్తే చాలు బెల్లం చుట్టూ ఈగల్లా అక్కడే ఉండేవాళ్ళు..
బాబ్జి: సార్ నాకొకటి అర్థమైంది..మీరు ఆ అమ్మాయుని ఇష్టపడ్డారు..అందుకే మీకు jealousy ..
రాజు: థాంక్స్ బాబ్జి ఫస్ట్ టైం బ్రెయిన్ use చేసావ్!!
దానికి తోడు బర్గర్ గాడికి డబ్బు మీద ఆశ ఎక్కువై రోజుకో application దించేవాడు..
బాబ్జి: ఈ బర్గర్ ఎవడు సార్..
రాజు: mark zuckerberg బయ్య .. ఆ అప్లికేషన్స్ బయంకరంగా ఉండేవి..అందులో who loves you today అని ఒక అప్లికేషను తను రోజు ఓపెన్ చేసేది..ప్రతి రోజు ఎవడెవడో పేర్లు వచ్చేవి..నా పేరు ఒక్క రోజు కూడా రాలేదు బయ్య..
బాబ్జి: very sad సార్ ..
రాజు: అందులో ఒకడి పేరు repeat గా వచ్చేది..అది నిజం అనుకొని వాడికి ఎక్కడ కమిట్ అయుపోతుందో అని భయం వేసేది..
బాబ్జి: ఉరుకొండి సార్ మీవన్నీ అనవసరపు భయాలు..
రాజు: ప్రేమలో భయం ఉంటుంది బాబ్జి..
బాబ్జి: ఇంతకు ముందు ఇష్టం అన్నారు..
రాజు: అదే ఇప్పుడు ప్రేమ బాబ్జి...
బాబ్జి: మరి మీ ప్రేమని ఆమెకి చెప్పారా?
అంత competition లో నేను participate చెయ్యలేకపోయాను బాబ్జి..FACEBOOK  కి goodbye చెప్పేసాను ..

థర్డ్ మీటింగ్ : C3 లో బయ్య..
బాబ్జి: ఏంటి సార్ అది రోడ్ no ?
రాజు: కాదు బాబ్జి ..నోకియా సెల్ ఫోన్ మోడల్ no..కొనేటప్పుడు నేను నీలాగే ఫీల్ అయ్యాను..
బాబ్జి: మీ నెంబర్ తనకేల తెలిసింది?
రాజు: నాకు అదే  డౌట్  వచ్చింది బయ్య..కాని అందమైన అమ్మాయు ఫోన్ చేస్తే మాట్లడాలే గాని ఇలాంటి లఫూట్ ప్రశ్నలు అడగకూడదని మా ముత్తాత చెప్పేవాడు..
బాబ్జి: ఆయనింకా ఉన్నాడా!!?
రాజు సీరియస్ గా  చూసాడు..బాబ్జి: అదే బయ్య ఇంకా కథలో ఉన్నాడా అని అడిగాను..ఓకే  ఓకే ..తర్వాత .
రాజు: తన వాయిస్ సూపర్ గా ఉంటుంది బయ్య..శ్రేయ ఘోషల్ వాయిస్ ని, చిన్మయు వాయిస్ ని  fridge  లో పెట్టి రెండు గంటల తర్వాత తీస్తే ...బాబ్జి: జలుబు చేస్తుంది సార్............సారీ...చెప్పండి..
రాజు: అంత మంచి వాయిస్ తనది..మళ్లీ మామూలే బయ్య..ప్రేమలో ..మెసేజ్ ఆఫర్స్ ..నైట్ callings...inbox full..sent box full..charging out..ఇలా కొన్ని రోజులు మామూలే..
తర్వాతే మాట్లాడుతుంటే వేరే కాల్ వస్తుంది అని కట్ చేసేది.నాకు పిచ్చ కోపం వచ్చేది ...ఎప్పుడు కాల్ చేసినా engage వచ్చేది..నాకేమో అనుమానం వచ్చేది..మెసేజ్ కి రిప్లై ఇచ్చేది కాదు...సడన్ గా నెంబర్ మార్చేది..
నాకు irritation ...aggravation... frustration......envy..ego..fear.....pain..  అలా అన్ని ఒకే సారి వచ్చేవి..
బాబ్జి: ప్రేమలో ఇన్ని Side effects ఉంటాయని తెలిదు సార్..
రాజు: నాకు ప్రేమించే వరకు తెలిదు బాబ్జి..పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయో  లేదో తెలీదు గాని..ప్రేమ మాత్రం నరకంలోనే పుడుతుందని అర్థమయుంది..
బాబ్జి: తర్వాత ఏమైంది సార్..
రాజు: తనని మరచిపోవాలని డిసైడ్ అయ్యాను..ఇంతలో recession పోయుంది ..

బాబ్జి: మీకు జాబ్ వచ్చిందా?
రాజు: తనకి వచ్చిందని తెలిసింది..దాంతో కసిగా interview కి  అటెండ్  అయ్యాను ..సోషల్ నెట్ వర్కింగ్ లో పడి సబ్జెక్టు దొబ్బింది..ఇంటర్వ్యూ లో సెలెక్ట్ కాలేదు...చాలా మందికి నా కథ చెప్పాను..అందరూ బాధపడ్డారే కాని ఎవడూ నా బాధని అర్థం చేసుకొని జాబ్ ఇవ్వలేదు..
 బాబ్జి: ఇప్పుడు ఆ అమ్మాయు ఏం చేస్తుంది సార్..
రాజు: పెళ్లి చేసుకొని  పిల్ల పాపలతో హయుగా ఉంది బాబ్జి..
బాబ్జి: చాలా బాధగా ఉంది సర్....
రాజు: హ..హమ్...అని సిగిరెట్ వెలిగించాడు..
బాబ్జి: ఆమె husband ఏమి చేస్తుంటాడు సర్..
రాజు: వాడొక పెద్ద ఎదవ బాబ్జి..ఉద్యోగం లేదు..పగలంతా ఇంట్లో తిని తొంగుంటాడు..చీకటి పడ్డాక ఇలా స్మశానంలో తిరుగుతుంటాడు..
బాబ్జి: సార్...........అంటే.....మీరే ఆమె భర్త..!!
రాజు: అవును బాబ్జి..
బాబ్జి: ఓహ్..మై గాడ్..అంత Negative situations నుంచి మళ్లీ ఎలా కలిసారు సర్..
రాజు: Relationships ఎప్పుడూ negatives నుంచే డెవలప్ అవుతాయు బాబ్జి..ఫొటోస్ లాగా..
ప్రేమించిన వ్యక్తిని మనం ఎంత మరిచిపోవాలనుకుంటే వాళ్ళు అంత గుర్తొస్తారు..అలా తనకి నేను గుర్తొచ్చి ఫోన్ చేసింది..
బాబ్జి:  అంటే తను మిమ్మల్ని ప్రేమించిందా?
రాజు: అవును బయ్యా..నేను తన relationships గురించి ఎలా బయపడ్డానో తను నా relationships విషయంలో అలానే బయపడింది..సోషల్ నెట్ వర్కింగ్ లో ప్రాబ్లం అదే బయ్యా..ఏ ఇద్దరి relationship గురించి మూడో వాడికి పూర్తిగా తెలీదు.దాంతో ఏదేదో ఊహించుకుంటారు...అందుకే మా ఇద్దరి మద్య గ్యాప్..infact ఇదే  కథని తన point of view లో చెప్తే..తను..నేను..నేను..తను..
మర్చిపోయాను మా ఫోర్త్ మీటింగ్ కళ్యాణ మండపంలో.. 
బాబ్జి: total negative story చెప్పి ఫైనల్ లో బలే పాజిటివ్ ట్విస్ట్ ఇచ్చారు సార్..
రాజు: నేనంతే భయ్యా..ఎంత negative story అయునా పాజిటివ్ ఎండింగ్ ఇవ్వడానికే ఇష్టపడతాను..
 ముగింపు తర్వాత ..స్మశానంలో నుంచి వెళ్ళిపోతూ..
బాబ్జి: అన్ని చెప్పారు..ఆ సమాధి లో నుంచి ఎలా లేసారో చెప్పండి సర్..
రాజు: నేను సమాధిలోంచి లేవలేదు బాబ్జి..సమాధి పక్కనుంచి లేచాను..అది మా ముత్తాత సమాధి..ఈ  మధ్యే ఆయన పోయారు..
బాబ్జి..I'm Sorry sir..
రాజు: its ok baabji..
ఫైనల్ గా నేకొకటి చెప్పనా..ప్రేమలు నరకంలోనే పుడతాయు..ఆ ప్రేమని పెళ్లితో స్వర్గం అనే ప్లేస్ కి మనమే తీసుకెళ్ళాలి..లేదంటే ప్రేమ నరకం లోనే ఉండిపోతుంది..

Friday, March 26, 2010

i just hate my life.

మనం  ద్వేషించే వాళ్ళంతా మనకి శత్రువులు  అయుతే మనలో  ఎవ్వరు కూడా శత్రువు మరణాన్ని కోరుకోరు..  
కాని మీ శత్రువు  మీరే అయుతే..మిమ్మల్ని మీరే ద్వేషించే పరిస్థితి జీవితంలో ఎదురైతే అటువంటి పరిస్థితి  మిమ్మల్ని మరణానికి చేరువ చేస్తుంది..
విషాదం ఏంటంటే జీవించడం కంటే చావడమే మేలనుకునే  స్థితి నుంచి బతికి బయట పడ్డ వాళ్ళు  చాలా తక్కువ మంది..
..............................................
ఒకటిన్నర సంవత్సరం క్రితం..
జోరు వర్షంలో ఆ ఊరు తడిసిపోతూ ఉంది.
చెట్లు కోపంతో ఊగిపోతున్నాయి.....
కరెంటు ఎప్పుడో పోయింది.
చిమ్మ చీకటిలో ఆ ఊరు స్తబ్దంగా ఉంది.

ప్రభుత్వ సాంఘిక  సంక్షేమ హాస్టల్ లోని ఒక రూంలో గాలికి ఊగుతున్న చెక్క కిటికీలని బలంగా లాగి గొళ్ళెం వేసాడు నరేష్.....
ఆ హాస్టల్ బయట కాంపౌండ్ లో ఓక చెట్టు కొమ్మ అప్పుడే విరిగి పడింది.
40 గదుల సాంఘిక  సంక్షేమ హాస్టల్ లో ఆరోజు అతను,watchman  తప్ప ఎవరూ లేరు.
ఆరిపోయిన కొవ్వొత్తిని  మళ్ళి  వెలిగించాడు నరేష్.
కొవ్వొత్తి  వెలుతురు చీకటిని చీలుస్తూ అతని ముఖంపై ప్రసరించింది.
అతని ముఖంలో ఏ భావము లేదు...ఓక నిర్లిప్తత అతన్ని పెనవేసుకుని ఉంది.
పెన్సిల్ తీసుకుని తెల్ల కాగితంపై రాయడం మొదలుపెట్టాడు.....
"i just hate my life". 
నా చావుకి ఎవరూ బాధ్యులు కారు...
బయటెక్కడో దూరంగా పెద్ద పిడుగు పడిన శబ్దం.రాస్తున్నప్పుడు అతని కళ్ళలో ఎర్రటి జీర.ముఖంలో కోపం.కుడి చెయ్యి సన్నగా కంపించింది...
ఆ లెటర్ని తన డైరీలో పెట్టి రూంలో ఫ్యాన్ వైపు చూసాడు.
అలిసిపోయినప్పుడు చల్లని గాలితో సేదతీర్చిన నేస్తం,ఓటమి మెట్లెక్కి విసిగిపోయిన అతని జీవితానికి చావనే ప్రశాంతతనివ్వడానికి సిద్ధంగా ఉంది.బావిలో నీళ్ళు లాగిలాగి సన్నబడిన చాంతాడు యమపాశంలా గాలిలో మెల్లగా కదులుతూ ఉంది.

అలారంలో 12 కావడానికి ఇంకా 120 సెకన్లు మాత్రమే ఉంది.
రేకు కుర్చీని ఫ్యాన్ కింద వేసి పైకి ఎక్కి నిలబడ్డాడు.తాడును మెడకి చుట్టుకున్నాడు.
12 కావడానికి ఇంకా 60 సెకన్లు ఉంది.చావు అతనికి 60 సెకన్ల దూరంలో ఉంది,చాలా దగ్గరగా...
అతని కళ్ళల్లోనుంచి కన్నీరు ఉబికింది.బయట వర్షం ఇంకా పెరిగింది.
30 సెకన్లు ఉంది.అతనికేదో గుర్తువచ్చింది.మేడలో తాడు తీసి  టక్కున కిందకి దూకి తన ట్రంకు పెట్టెలోనుంచి ఒక B\W ఫోటోని బయటికి తీసి,కన్నీటిపోరని చెరిపేసి.. చనిపోయిన వాళ్ళమ్మని రెండు క్షణాలు చూసి,ముద్దు పెట్టుకుని టక్కున మళ్ళీ కుర్చీ ఎక్కి తాడు బిగించుకున్నాడు.
10 సెకన్లు ఉంది.అతని వెన్నుపూసలో మొదలైన వణుకు శరీరమంతా వ్యాపించింది.అతని కళ్ళలో చావు భయం.కాని అతని నిర్ణయం ఆ భయాన్ని అధిగమించింది.
ఇంక 5 సెకన్లు.తాడుని మెడకి గట్టిగా బిగించాడు.పాదాలు కుర్చీని తన్నడానికి సిద్ధంగా ఉన్నాయి.గట్టిగా కళ్ళు మూసుకుని కుర్చీని తన్నబోయి....
టక్......?
టక్కున కళ్ళు తెరిచి అలారంవైపు చూసాడు.
ఎర్రముల్లు 12 కి 2 సెకన్ల ముందు గాలిలో తలకిందులుగా  వేలాడుతున్న శవంలా ఆగిపోయింది.
తన ఆఖరి కోరిక తీరడానికి 2 సెకన్ల ముందు ఆగిపోయిన గడియారాన్ని కోపంగా చూసాడు నరేష్.
పెద్ద అరుపుతో,చిన్న శబ్దంతో ఆ రూంలో గడియారం బ్రద్ధలయ్యింది.ఎర్రముల్లు నేలపై పడిన శవంలా ఉందిప్పుడు.

అతను మళ్ళీ ఆవేశంగా కుర్చీ ఎక్కి తాడు బిగించుకుంటుండగా ..బయట ఆకాశంలో మెరుస్తున్న మెరుపులాంటి  ఒక పెద్ద వెలుగు ఆ రూంలోకి ప్రత్యక్షమయ్యింది.ఆ వెలుగుని చూసిన నరేష్ ఆశ్చర్యంతో  స్థాణువులా అయ్యాడు.
ప్రసరణ శక్తిలేని ఆ వెలుగుకి ఒక ఆకారం ఉంది.ఆ ఆకారాన్ని ఎక్కడో చూసాడు.కానీ గుర్తురావడంలేదు.
కొవ్వొత్తి కరిగిపోవడంతో అతని చుట్టూ చీకటి ఏర్పడింది.

ఆ చీకటిని చీలుస్తూ ఆ వెలుగు మాట్లాడింది..
"చావుకోసం తొందరెందుకు".
ఆ మాటల్లో ఏదో శక్తి ఉంది.ఆ కంఠంలో జాలి,దయ,ప్రేమ అన్నీ ఉన్నాయి.ఆ మాటలు అతని మనసుని నేరుగా తాకుతున్నాయి.
నువ్వు దేవుడివా?...ప్రశ్నించాడు  నరేష్.
"నమ్మకముంటే అలానే భావించు".ఈసారి ఇంకా మృదువుగా పలికింది ఆ కంఠం .
ఎలా నమ్మాలి నిన్ను........
నా కడుపు ఆకలితో మండిపోయినప్పుడు నువ్వు రాలేదు.నా గుండెలు భాదతో క్రుంగిపోతున్నప్పుడు నువ్వు రాలేదు.అనాధ బ్రతుకుకి ఒక స్నేహితుడిలా నువ్వు రాలేదు.
ఇప్పుడెందుకొచ్చావ్?నా చావుని చూసి వెక్కిరించదానికా?
అతని గుండెల్లో పగిలిన అగ్నిపర్వతం తాలుకా లావా గొంతులో నుంచి మాటల రూపంలో బయటికొచ్చింది.
ఆ వెలుగు మాట్లాడలేదు.
కష్టపడ్డాను,ఎంతో కష్టపడ్డాను.మా కాలేజిలో టాప్ టెన్లో ఒకడినయ్యాను.గేట్ రేంక్ సాధించాను.
కాని నువ్వు...నువ్వు  నాతో ఆడుకున్నావ్....నా జీవితాన్ని నాశనం చేసావ్.నేలపై కూలబడి ఏడుస్తున్నాడు.
"నేనా?నేను నీ జీవితాన్ని నాశనం చేసానా"?
నువ్వే....నువ్వే....
"ఎలాగో చెప్పగలవా"?
చెప్తాను..
నా బాధలు చెప్పుకోవడానికి కూడా తోడు లేకుండా చేసావ్.చచ్చిపోయేముందు నీతో చెప్తాను.

ఈ రోజు ఉదయం ఇంజనీరింగ్ ఆఖరి  పరిక్ష రాయడానికి అందరికంటే ముందుగా BUSSTOP కి వెళ్ళాను.
కరెక్ట్ గా బస్సు వచ్చే టైంకి, అక్కడ అంతమంది ఉంటే కాకి నాపైనే ఎందుకు రెట్టవేసింది? .....బాధగా అడిగాడతను.
హహహ హ హహ ......ఆ వెలుగు నవ్వింది.
నరేష్ కి కోపం వచ్చింది.
వెలుగు నవ్వు ఆపి ఇలా  చెప్పింది.
చూడు  మిత్రమా ఆ కాకి నిన్న మీ లెక్చరర్ పైన..మొన్న మీ కాలేజ్ అమ్మాయి పైన,అంతకు ముందు రోజు మరొకడిపైన ,ప్రతీ రోజు ఎవడో ఒకడి పైన రెట్ట వేస్తూనే ఉంది.వాళ్ళందరూ ఏమైనా ఆత్మహత్య చేసుకున్నారా?
నేను చనిపోతుంది అందుకు కాదు.దాని పర్యావసానంగా జరిగిన సంఘటన వల్ల.కోపంగా చెప్పాడు నరేష్.

అవునా..దాని పర్యావసానం?
నాకు తెలిసి ఆ తరవాత నువ్వు పరిక్షకు 30 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళావ్.పరిగెత్తుకుంటూ,హాడావుడిగా  వెళ్ళడంతో నీ కళ్ళు బైర్లు కమ్మాయి.మెదడు పని చెయ్యలేదు.రెండు ప్రశ్నలకి సమాధానాలు రాసే సరికి 2 గంటల సమయం పట్టింది.ఇంతలో నీ పెన్ లో  ఇంకు అయిపోయింది.నువ్వనుకొనే మొహమాటంతో[ ఆత్మనూన్యతా భావంతో]ఇన్విజిలెటర్ ని సాయం కోరాలా వద్దా అని ఆలోచిస్తుండగా బెల్ మోగింది.
ఇందులో నీ ఆత్మహత్యకి కారణం ఏమిటో నాకు బోధపడటంలేదు.

నీకేమి అర్థం కాదు.
నువ్వు మనిషివైతే నీకు నా కష్టాలు తెలిసేవి.
రెండు ప్రశ్నలకి మాత్రమే  సమాధానాలు రాసిన నేను ఎలా పాస్ అవుతాను?ఫెయిల్ అయితే నా బ్రతుకేంటి?
వెలుగు మళ్ళీ నవ్వింది...
రెండు ప్రశ్నలకి సమాధానాలు రాసిన నువ్వెందుకు ఫెయిల్ అవుతావు?ఒకవేళ ఫెయిల్ అయినా మళ్ళీ నెలరోజుల్లో పరిక్ష రాయొచ్చు.
దీనికే  ఆత్మహత్య చేసుకోవాలా?
ఒక్కసారి ఆలోచించు..చాలా శాంతంగా చెప్పింది వెలుగు.

 నరేష్ ఆలోచించడం ప్రారంభించాడు.రెండు ప్రశ్నలకి 32 మార్కులు వచ్చే చాన్స్ ఉంది.28 మార్కులు చాలు పాస్ కావడానికి.ఇన్విజిలేటర్ మంచివాడైతే చివరి సెమిస్టర్ పరిక్షలు రాస్తున్న విద్యార్ధిని ఫెయిల్ చెయ్యడు.
అంటే తను పాస్ అయ్యే అవకాశం ఉంది.
 ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళి instant  రాయచ్చు.మరి తనెందుకు ఆత్మహత్యకి ప్రయత్నించాడు.

ఛఛ....అతనికంతా అయోమయంగా ఉంది కాని, తనకి వచ్చిన కష్టం,ఆత్మహత్య చేసుకోవాల్సినంత పెద్ద కష్టం కాదని స్పష్తంగా  అర్థమయ్యింది.
తన తప్పు తెలుసుకుని నరేష్ తలదించుకున్నాడు.
ఛ...నేనెందుకు ఇంత చిన్న విషయానికి అంతగా  భయపడ్డాను.తన  blood గ్రూప్ b negative??
ఆ భయంతో చావు దాకా వెళ్ళాను.తనని తానే ప్రశ్నించుకుంటున్నాడు....బాధపడుతున్నాడు..


ఓహ్.....బాధపడకు మిత్రమా..
నీలాంటివాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు...చెప్పటం ప్రారంభించింది వెలుగు..

తనకి చెప్పకుండా CELLPHONE కొన్నాడని భర్తతో గొడవపెట్టుకుని ఆత్మహత్య చేసుకున్న మహిళ.
17 ఏళ్ళ వయసులో ప్రేమకంటే చదువు ముఖ్యం అని తల్లి మందలించినందుకు ఒక కూతురు,
ఉద్యోగం,సకల సౌకర్యాలు ఉన్నా జీవితం బోర్{?}కొట్టిందని ఒక SOFTWARE  ఉద్యోగి,
ప్రేమ విఫలమయ్యిందని ఒక ప్రేమికుడు..
అప్పులవాళ్ళు గొడవచేస్తున్నారని,పరీక్షల్లో ఫెయిల్ అవుతామని,ఉద్యోగం రాలేదని,వచ్చిన ఉద్యోగం  రెసిషన్ లో పోయిందని, ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుని సుఖపడిపోతుందని,చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేసారని,అత్త తిట్టిందని,ఆడపడుచు నవ్విందని, ఇలా చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న కాలం ఇది.

కాకపోతే నీ చావుకి నువ్వొక ముహర్తం పెట్టుకున్నావ్.
గడియారం ఆగిపోవడంతో చివరిక్షణంలో బతికి బయటపడ్డావ్.
ఇవన్ని నీకు కూడా తెలుసు మిత్రమా ....రోజూ న్యూస్ పేపర్ లో చదువుతూ  ఉంటావు ,న్యూస్ ఛానల్ లో చూస్తూ ఉంటావు.కాని మర్చిపోయావ్ అంతే.
...అంగవైకల్యంతో పుట్టినవాళ్ళు ఆత్మవిశ్వాసంతో బ్రతుకుతుంటే అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవాళ్ళు చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు.భాదగా ఉంది మిత్రమా.భరించలేనంత భాదగా ఉంది.
వేదన నిండిన స్వరంతో పలికింది వెలుగు.
నరేష్ కి మబ్బులు విడిపోయాయి.తన తప్పు చాలా స్పష్టంగా తెలిసింది...
కొత్తజీవితానికి స్వాగతం మిత్రమా.మళ్ళి ఇలాంటి పని చెయ్యవని ఆశిస్తున్నా.అని చెప్పి ఆ వెలుగు అంతరార్ధమయ్యింది.

I JUST HATE MY LIFE పేపర్ ని చింపి,కిటికీ తలుపులు తెరిచాడు.వర్షం ఆగిపోయి చాలాసేపయ్యింది.కరెంట్ వచ్చింది.చీకటి మాయమయ్యింది.ఆ పేపర్ ముక్కల్ని బయటికి విసిరేశాడు నరేష్.అవి కాలువలో పడి ప్రవాహంలో పోతూ ఉన్నాయి.
     

ఒకటిన్నర సంవత్సరం తరవాత..........
ఆ రోజూ వర్షం లేదు,చీకటి లేదు.అంతా మాములుగా ఉంది.కాని naresh మళ్ళి  కుర్చీ ఎక్కి తాడు బిగించుకున్నాడు...
ఈ సారి వెలుగు చాలా త్వరగా ప్రత్యక్షం అయ్యింది.నరేష్ ఆనందపడుతూ...తాడు తీసేసి కిందకి దిగాడు.
ఏంటి మిత్రమా ఇది?సున్నితంగా అడిగింది వెలుగు.
క్షమించు స్వామి.నువ్వు ఆ రోజూ నన్ను కాపాడావ్.నా జీవితం మారిపోయింది.30 మార్క్స్ తో పాస్ అయ్యాను.
గేట్ ర్యాంక్ తో   M.TECH సీట్ వచ్చింది...వారం క్రితం కేంపస్ సెలక్షన్స్ లో  M.N.C లో జాబ్ వచ్చింది.ఒకటిన్నర సంవత్సరంలో నా జీవితం పూర్తిగా మారిపోయింది.
ఈ ఆనందాన్ని నీతో పంచుకోవాలని,నీ కోసం ఎన్నో  ప్రార్ధనలు చేసాను.కాని నువ్వు ప్రత్యక్షం కాలేదు.
 అప్పుడే నాకు ఈ  ఐడియా వచ్చింది.

హహ....నవ్వింది వెలుగు.
ఈ కృత్రిమ ఆనందాన్ని పంచుకోవడానికి ఇంత నాటకం అవసరమా?చాలా మాములుగా ప్రశ్నించింది  వెలుగు.
నరేష్ కి భాద వేసింది...
తన ఆనందాన్ని,కృతజ్ఞతలని చెప్పుకోవడానికి వారం రోజులుగా అతను ప్రార్ధించినా ఆ వెలుగు ప్రత్యక్షం
కాలేదు .తీరా ఈ రోజూ ప్రత్యక్షమయ్యాక,ఇలా మాట్లాడుతుందని అతను ఊహించలేదు...అతను బాధపడుతుండగా అతని అనుమానాల్ని చల్లటి గాలులతో మనసులోనుంచి తరిమికోడుతూ చెప్పడం ప్రారంభించింది వెలుగు.

 నీకు ఉద్యోగం రావటం వాలిన కలిగిన ఆనందం ...అది కృత్రిమ ఆనందం.
ఆ ఆనందాన్ని పంచుకునే నలుగురు ఆత్మీయ స్నేహితులని పొందడం శాశ్వతమైన ఆనందం.
నీకు అలాంటి  స్నేహితులు ఉన్నారా?
నరేష్ తల దించుకున్నాడు.

డబ్బుతో ఆనందం రాదు.సుఖం వస్తుంది.
అనుబందాలతో,జీవితంలో ఆనందం వస్తుంది.
కేవలం మనుషులతో,అనుబందాలతో మాత్రమే జీవితంలో గొప్ప ఆనందం వస్తుంది.

నరేష్ కి అర్థం కాలేదు..
ప్రపంచంలో అందరూ డబ్బుతో ఆనందాన్ని కోనుక్కుంటుంటే,నువ్వేంటి స్వామి......డబ్బుతో ఆనందం రాదని అంటున్నావ్.
అసలు సుఖానికి ఆనందానికి తేడా  ఏంటి? అడిగాడు నరేష్..

సుఖమంటే ...తిరగటానికి సొంత విమానం..luxury cars, తాగటానికి స్కాట్చ్,తినటానికి స్టార్ హొటల్స్ ,పడుకోవటానికి మెత్తని పరుపులు..వాడుకోవటానికి  ఖరీదైన GADGETS, ఉండటానికి పెద్ద ఇల్లు, ఆ ఇంట్లో  పదిమంది  పనోళ్ళు, ....అది.

మరి ఆనందమంటే?

ఆనందమంటే.....
మనల్ని వదిలి దూర దేశాలకి వెళుతున్న స్నేహితుడికి భాదతో ఇచ్చిన కౌగిలింత.
ప్రియురాలి  ముక్కుపుడకపై రాసే మూడు పేజీల కవిత,
వెన్నెల్లో డాబాపై పడుకుని చందమామతో చెప్పే కబుర్లు,


కష్టాల్లో ఉన్నవారికి చేసే సహాయం,భాదల్లో  ఉన్నవారికి నువ్విచ్చే ఓదార్పు,
 పసిపాపల నవ్వులని చూడటం.ఒక మొక్కని నాటి పెంచడం,అప్పుడప్పుడు స్నేహితులకి లెటర్స్ రాయడం,నీ అభిరుచులకి సమయం కేటాయించడం,అప్పుడపుడు ఫూలిష్ గా బిహేవ్ చేసి అందరితో తిట్లుతిని నవ్వుకోవడం.........చెప్తూ  ఉంది  వెలుగు ..

ఒక్కొక్క మాట నరేష్ గుండెల్ని తాకి అతని మనసు స్పందించింది..
క్షణ కాలం మౌనం తర్వాత వెలుగు మళ్ళి చెప్పటం ప్రారంభించింది.
మిత్రమా..
పుడమి తల్లిని ముద్దాడటానికి భూమి పై పడిన చినుకు తనలో కరిగిపోతున్నప్పుడు..భూదేవి తన ప్రేమనంతా మట్టి రూపంలో వెదజల్లుతుంది..ఆ మట్టి  వాసన ఎప్పుడైనా పీల్చావా?
ప్రపంచానికి వెలుగు పంచడానికి తూరుపు తలుపులు తెరుచుకొని వస్తున్న సూర్యుడిని చూస్తున్నావా రోజూ ?
 పువ్వులలో   మకరందాన్ని  ఆస్వాదిస్తున్న సీతాకోక చిలుకలని  చూసావా?
గలగలా పారే సెలయేల్లని..వర్షం వెలిసాక  కనిపించే ఇంద్రధనుస్సు ని..తల్లి పాల కోసం పరిగెడుతున్న లేగ దూడని..గుడి వెనక కోనేట్లో ఉన్న కలువ పూలని..గడ్డి మొక్క పై వాలిన మంచు బిందువులని..

ఏమి చూసావ్ నువ్వు..ఏమి చూడలేదు..
ఉద్యోగంతో డబ్బు వస్తుంది,ఆ డబ్బుతో సుఖాలని అనుభవించాలని కష్టపడటం తప్ప... ఇన్ని రోజుల నీ జీవితం లో ఇలాంటి పనులు ఏమైనా చేశావా?

ఆనందం మన మనసులో ఉంటుంది మిత్రమా..మనం చేసే పనుల్లో ఉంటుంది..డబ్బుతో దాన్ని కొనలేవు..
నరేష్ హృదయం కరిగి కన్నీరు చెంపలని తాకింది.

నీకు ఆనందాన్ని పంచే కోట్ల అనుభూతులు ఈ ప్రపంచంలో ఉన్నాయు..వాటిని పొందటానికి ప్రయత్నించు మిత్రమా..
వస్తాను...అని వెళ్ళిపోతున్న వెలుగుతో..
ఒక్క క్షణం స్వామి..
ఆగింది వెలుగు..

నేను నీతో రోజు మాట్లాడొచ్చా?
మాట్లాడొచ్చు మిత్రమా..
ఎలా?

ప్రతి రోజూ కొన్ని నిముషాలు ..చాలా కొద్ది నిముషాలు..నీ పనులన్నీ అయ్యాక..ఒంటరిగా,నిశబ్ధం గా కూర్చొని కళ్ళు మూసుకొని నీతో నువ్వు మాట్లాడుకో..
ఈ రోజూ ఏమి చేసాను..ఏదైనా తప్పు చేసాన?ఎలా సరిదిద్దుకోవాలి?
రేపు ఎలా జీవించాలి?
నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో..
చెప్పింది వెలుగు...
నరేష్ కి అంతా అయోమయం గా ఉంది..తనలో తానూ మాట్లాడుకుంటే దేవుడితో ఎలా మాట్లాడినట్లు అవుతుంది?
అతని అనుమానాలని పారద్రోలుతూ చెప్పింది వెలుగు..
నువ్వు నాతో మాట్లాడటం అంటే నీ ఆత్మ తో నువ్వు మాట్లాడటం..
అప్పుడు గమనించాడు అతను ఆ వెలుగు రూపాన్ని...అది  తన ఆకారంలోనే ఉంది..అవును తనలానే ఉంది.
అతని గుండె వేగం పెరిగింది..తను మాట్లాడుతుంది తన ఆత్మతోనా?
అతను ఆలోచిస్తుండగా.. ఆ వెలుగు అంతర్థానమై అతనిలో కలిసిపోయుంది..
.........................................................................................................
if you feel this story is good,then suggest one of your friends.:)
.........................................................................................................

Sunday, March 21, 2010

జయన్న కేఫెలో ఇంతిగాడి లవ్ స్టోరి . written by mahy.

మన RV తన బ్లాగ్ లో జయన్న కేఫ్ కథలు అని మొదలు పెట్టాడు.తాను రాసిన రెండు పోస్టింగ్స్ చదివాక నేను నా జ్ఞాపకాల దొంతెరను తీసి ఏకంగా తన బ్లాగ్ లో ఒక కథ రాసాను.అదే .........
                                         ఇంతిగాడి లవ్ స్టోరి         

కరెక్టగా నా డిగ్రీ అయిపోయి నేను మా బిజినెస్ చూసుకుంటున్న రోజులు కాళీగా ఉన్న సమయాన్ని ఎలా గడపాల అనే ఆలోచనలో మాకు దొరికిన ఏకైక అడ్డా మా జయన్న కేఫ్.మా టీ మాస్టారు,సుబ్బుగాడు,అక్బర్ గాడు,సూర్యగాడు,కే.సి.వి,డాలోడు... ఇలా చాలామందిలో నేను.. ఇంతిగాడు[ఇంతియాజ్] .
ఈ ఇంతిగాడు ఎవరనేగా మీ డౌట్.ఇంతిగాడు ఎవరంటే మా ఊరిలో ఉండే కాటన్ నవాబు రెండో కొడుకు.
అసలు ఇంతిగాడు స్కూల్లో నాకంటే ఒక సంవత్సరం పెద్ద.
అంటే వాళ్ళది సెయింట్ఆన్స్ స్కూల్,నాది కావలి పబ్లిక్ స్కూల్.
ఇంతిగాడు ప్రేమించేది మా స్కూల్లో చదివే సీనియర్ని.
ఆ అమ్మాయి సెయింట్ఆన్స్ స్కూల్ కి షిఫ్ట్ అయిన తరవాత ఇద్దరు ప్రేమలో పడ్డారు.
ఇది నేను ఏడవ క్లాసులో ఉన్నప్పుడు విన్న మాట.
                             
ఇలా నేను కేఫ్ లో గడిపే సమయంలో ఒకరోజు అక్బర్ గాడితో దమ్ము కొడుతున్నాను.
ఎవడో ఒకడు నల్ల జర్కిన్,బ్లూజీన్స్,రీబాక్ స్పోర్ట్స్ షూ వేసుకుని స్టైల్ గా వచ్చి మా పక్కన కూర్చున్నాడు.
ఇంకా స్టైల్ గా గోల్డ్ కింగ్ సిగరెట్ నోట్లో పెట్టుకుని వెలిగించుకున్నాడు.
ఇంతలో అక్బర్ గాడు పరిచయం చేసాడు ఇతనే ఇంతియాజ్ అని,హైదరాబాద్ లో జాబ్ సెర్చ్ లో ఉన్నాడని.
అప్పుడు వెలిగింది ఈ ఇంతిగాడే కదా ఆ రోజుల్లో మా సీనియర్ ని లవ్ చేసాడని.
 పరిచయం చేసాడో లేదో చాలా క్లోజ్ అయ్యాడు.
అప్పుడే అర్థమయ్యింది తను చాలా లైట్ గోయింగ్ అని,ఫ్రెండ్షిప్ కి ఎంతో విలువిస్తాడని.
అలా  మేము వారం రోజుల్లో క్లోజ్ అయ్యాం.తరవాత వాడు నాకు చెప్పిన నిజాన్ని విని చాలా షాక్ అయ్యా.అది ఏమిటనేగా,వాడు ఇంకా ఆ అమ్మాయినే లవ్ చేస్తున్నాడని.ఏడో తరగతిలో లవ్ చేసి ఇప్పుడు బి.టెక్ అయిన తరవాత కూడా వాళ్ళు ప్రేమించుకుంటున్నారని తెలిసి ఒకరకమైన షాక్.
ఇంతలో  లాలీపాప్ చీక్కుంటూ వచ్చాడు జగదీష్.జగదీష్,ఇంతి క్లోజ్ ఫ్రెండ్స్.జగదీష్ ఎవరంటే మా ఫ్రెండ్ రాకేష్ వాళ్ళ అన్న.

          ఇలా  మా ఫ్రెండ్షిప్ మూడు సిగరెట్లు ఆరు టీలుగా సాగింది.
అలాగే ఇంతి తన లవ్ స్టొరీ నాకు చెప్పాడు.నాకు చాలా థ్రిల్లింగా ఉండేది.
అన్ని లవ్ స్టోరీస్ లాగా ఈ విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసింది.
ఇంకేముంది ఆ అమ్మాయిని చెన్నైలో ఉండే వాళ్ళ బంధువుల ఇంటికి పంపారు.
వీళ్ళ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్.ఇక చూడండి మన ఇంతి గాడి పరిస్థితి.దేవదాసై దిగులుగా గెడ్డం పెంచేసి దీనంగా ఉంటాడని అనుకుంటున్నారా?అదేం లేదు చాలా సరదాగా జోకులేసుకుంటూ చాలా లైట్ గా ఉన్నాడు.మళ్ళీ నాకు షాక్!!

అన్ని లవ్ స్టోరీస్ లాగ మన ఇంతి గాడి లవ్ స్టొరీకి ట్విస్ట్ రానే వచ్చింది.ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు.
ఒక రోజు సాయంత్రం ఇంతిగాడు కేఫ్ కి వచ్చాడు.నేను ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను,ఇక మేము లేచిపోవాలని అనుకుంటున్నాము అని చెప్పాడు.మళ్ళీ షాక్!

ఆ అమ్మాయి పినాకిని express లో చెన్నై నుంచి కావలికి వాళ్ళ ఆంటితో బయలుదేరింది.మన కేఫ్ నుండి అక్బర్ గాడు,శీనుగాడు,కే.సి.వి.ఇలా ఇంతి గ్యాంగ్ తో బయలుదేరాడు.నెల్లూరుకెళ్ళి పినాకిని  క్యాచ్ చేసారు.వీళ్ళంతా అమ్మాయి ఉండే కంపార్టుమెంట్ ఎక్కారు.ఇద్దరు చూసుకున్నారు.కళ్ళతో ఏదో కమ్యునికేట్ అయ్యారు.బ్యాచ్ అంతా టెన్షన్ గా ఉన్నారు.ఇంతిగాడి ప్లాన్ ఏమిటో ఎవరికీ తెలియదు.వాడు ఎవడికి చెప్పడు.కావలి రానే వచ్చింది.అందరికి టెన్షన్.అమ్మాయి పక్కన వాళ్ళ ఆంటి.ఇంతి ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు.స్టేషన్ వచ్చింది.ఆ అమ్మాయి వాళ్ళ ఆంటితో platform పైకి దిగింది.ఆ అమ్మాయి ఇంతి&కో ని అలా చూస్తూ వెళ్లిపోయింది.అంతలో ఇంతిగాడు అలా ఆ అమ్మాయి కూర్చున్న సీటు దగ్గరికి వెళ్లి తను విడిచిన బ్యాగ్ తీసుకుని platform మీదకి దిగాడు.
ఎవరికీ ఏమీ అర్థం కాలేదు.అందరు నేరుగా జయన్న కేఫ్ కి వచ్చారు.అప్పుడే నేనూ కేఫ్ కి వచ్చా.అందరు ఇంతిగాడిని తిడుతున్నారు.ఏమైంది అని నేను అక్బర్ గాడిని అడిగా.జరిగిందంతా చెప్పాడు.ఇంతకీ ఆ బ్యాగ్ లో ఏముంది?అసలు వీడి స్కెచ్ ఏమిటి?
అమ్మాయికి సంబంధించిన సర్టిఫీకేట్స్,నెలకు సరిపడా బట్టలు.
ఇంతి రిజిస్టర్ మ్యారేజ్ కి అప్లై చేసాడు.ఏజ్ ప్రూఫ్ కి అమ్మాయి సర్టిఫికేట్స్ పెట్టాడు.అది వాడి ప్లాన్.అందుకే పినాకినిలో high drama క్రియేట్  చేసాడు.

ఒక రోజు ఇద్దరు జయన్న కేఫ్ లోని ఫ్రెండ్స్ హెల్ప్ తో రిజిస్టర్ ఆఫీసులో మ్యారేజ్ చేసుకుని,తన మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని  హైదరాబాదుకు చేరారు.అంతకు ముందే ఇంతి లంగరుహౌస్ లో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.ఈ విషయం మాకు ఎవరికీ చెప్పలేదు.వెళ్ళే ముందు నా దగ్గర కొంత మనీ తీసుకున్నాడు.అలానే తాను దాచిపెట్టుకున్న మనీ అంతా రెడీ చేసుకుని హైదరాబాద్ వెళ్లారు.ఒక నెల రోజులు హైదరాబాద్ లో ఇంటినుండి బయటికి రాకుండా ఆ ఇంట్లోనే గడిపారు.ఇంతి ఫోన్లు అన్ని స్విచ్ఆఫ్ చేసాడు. ఇక్కడ ఇంతి వాళ్ళ ఇంట్లో అంతా సీరియస్.అలాగే అమ్మాయి ఇంట్లో వాళ్ళు వీళ్ళ కోసం అన్ని చోట్ల తిరిగారు.

                       కేఫ్ లో అందరికి ఒకటే టెన్షన్.ఎందుకంటే అందరం ఇన్వాల్వ్ అయ్యున్నాం కదా లవ్ స్టోరీలో.ఇంతలో ఇంతి బెస్ట్ ఫ్రెండ్ జగదీష్ ని అమ్మాయి వాళ్ళ నాన్న ఇంటికి పిలిచి మాట్లాడాడు అన్న టాక్ వచ్చింది కేఫ్ లో.ఇక అంతే ఎవడికి వాడు నా పేరు చెప్పుంటాడని అందరు భయపడుతున్నారు.
తరవాత నేను జగదీష్ ని అడిగా మేటర్ ఏంటని.ఏమీ లేదు బెదిరించారు,నేను ఏమీచెప్పలేదు అన్నాడు.అయినా ప్రతీ ఒక్కడికి జగదీష్ మీద డౌట్.ఎందుకొచ్చిన తలనొప్పి అని కొందరు,ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా అని కొందరు.అలా అలా గడిచిపోతున్నాయి రోజులు.
ఒక నెల రెండు నెలలు తరవాత ఇంతియాజ్ కేఫ్ లో కనిపించాడు.అంతా హ్యాపీ మామ,అందరు ఒప్పుకున్నారు,అంతా ఓకే అంటూ కింగ్ వెలిగించి రింగులు వదులుతూ చెప్పాడు.ఓకే నాకు హ్యాపీగా అనిపించింది.ఇంకేమిటి ఇంతి పార్టీ ఎప్పడు ఇస్తున్నావ్ అని అడిగా.నువ్వు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు అన్నాడు హుషారుగా.సరే నేను వెళ్తున్నా అని చెప్పి కేఫ్ నుంచి బయలుదేరాడు ఇంతి.అలా వెళ్ళడం,వెళ్ళడం ఇక ఇప్పటికీ కనపడలేదు.మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలిసాడు.అమ్మాయి పుట్టిందని చెప్పాడు.అలాగే U.K వెళ్లానని చెప్పాడు.అంతే.. తర్వాత నెమ్మదిగా మమ్మల్ని మర్చిపోయాడు..

                                        కేఫ్ లో అందరు ఇంతి అవసరం అయ్యాక వదిలేసాడని,కావాలనే మమ్మల్ని వాడుకున్నాడని ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు.కాని నాకు ఇంతి మీద ఎప్పుడూ అలాంటి ఫీలింగ్ లేదు.మరి ఇన్ని రోజులు మమ్మల్ని ఎందుకు కలవలేదు?ఇంతికి ఫ్రెండ్ షిప్  వేల్యూ తెలియదా?మమ్మల్ని వాడుకున్నడా ?ఏమో ! ఇంతి మనసులో ఏముందో?
ఇంత మంది ఏమి ఆశించి ఇంతికి  హెల్ప్ చేసారు.దీనికంతా మా మద్య ఉన్న స్నేహమే కారణం..మరి ఆ స్నేహం పుట్టింది జయన్న కేఫ్ లో..
మమ్మల్ని మరచి దూరంగా ఉన్న ఇంతి ఈ కథ చదివి కలుసుకుంతాడనే ఆశతో...............మహి.

Friday, March 19, 2010

director sukumar interview.

నాకెంతో  ఇష్టమైన  డైరెక్టర్ సుకుమార్ ఇంటర్వ్యూ...ఈనాడు సండే బుక్ లో వచ్చింది..మిస్ అయున వాళ్ళ కోసం..
large font lo chadavataaniki posting pai click cheyyandi.


now mahy writes...



మిత్రులకి నమస్కారం..

మహి.. 
మహికి విప్లవభావాలు ఎక్కువ.
నా  బ్లాగ్ లో ఒక కథ రాయమని నా మిత్రుడు మహిని అడిగాను..
ఏ పేదవాడి కూలిపోయున గుడిస గురించో...ఏ యువకుడి రాలిపోయున ఆశల గురించో రాస్తాడని అనుకున్నాను..
కాని  లవ్ స్టొరీ రాసాడు..కామ్రేడ్ మహి లవ్ స్టొరీ రాస్తే ఎలా ఉంటుంది?..చదవాలని నాకు ఉంది.

జయన్న  కేఫ్ లో జరిగిన ఒక యదార్థ ప్రేమ కథని  రాసి పోస్ట్ చేస్తున్నాడు మహి..
నాకు జస్ట్ ప్లాట్ చెప్పాడు..కథని మీతోపాటు చదవాలి.

మహి  గురించి కొంచెం..
మహికి social awareness ఎక్కువ . సమాజానికి ఏదో చెయ్యాలి అనుకొనే వ్యక్తి..ఎన్నో చేసిన ఏమి చెప్పుకోడు.
మా కావలిలో open drainage సిస్టం పైన ఓపెన్ గా ఫైట్  చేసిన వ్యక్తి..[:)]
రెడ్ క్రాస్ ..జన విజ్ఞాన వేదిక...భామ..ఇలా దాదాపు మా కావలిలో ఉన్న అన్ని రకాల సంఘాల్లో సభ్యుడు.
మహి గొప్ప photographer.
త్వరలో నా బ్లాగ్ లో మహి ఫొటోస్ ని కూడా upload చేస్తాను . 
ఇంకొంచెం..
అన్ని వయసుకు మించిన పనులు చేస్తుంటాడు మహి..
ఆడుకోవాల్సిన వయసులో ప్రేమించాడు..[ఆమ్మయులని కాదులెండి]
ప్రేమించాల్సిన వయస్సులో సమాజ సేవ,కుటుంభ బాద్యతలు నిర్వర్తించాడు..
మహికి చమత్కారం , మమకారం రెండు ఎక్కువే.. అతని కథలో అవి ఉంటాయని ఆశిస్తున్నాను..


Tuesday, March 9, 2010

అప్పుడు.. ఇప్పుడు..ఓ ప్రేమకథ.

ఇప్పుడు..

gmail లో తన మెయిల్ చూసుకున్న బాలకృష్ణ ఉద్వేగంతో పెద్దగా యాహూ అని అరిచాడు.
బాలకి job confirm చేస్తూ పుణే లోని ఒక software company H.R department పంపిన మెయిల్ అది.
బాల ఇంజనీరింగ్ లో సబ్జెక్ట్ నేర్చుకున్నా..... communication skills లేకపోవడంతో మూడేళ్ళు  ఖాలిగా  గడపాల్సి వచ్చింది.
అమీర్ పేటలో  నెలకో కొత్త software course బట్టీ పట్టినా ఉద్యోగం రాలేదు.ఇప్పుడు కూడా అతని స్నేహితుడొకడు ఆ కంపెనీ H.R department లో పనిచేస్తుండటం వల్ల బాలకి  ఈ ఉద్యోగం వచ్చింది.మనసులోనే స్నేహితుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
పెద్ద కంపెనీ....పెద్ద జీతం....ఇంకేముంది పెళ్లి చేసుకోవచ్చు.వెంటనే స్నేహితుడి మొబైల్ తీసుకుని ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి శుభవార్త చెప్పాడు.
బాల నాన్న శివకృష్ణకి  గొప్ప రిలీఫ్ కలిగింది.మధ్యతరగతి తండ్రికి కొడుకుకి ఉద్యోగం రావడం కంటే గొప్ప రిలీఫ్ ఏముంటుంది.ఇప్పుడు దైర్యంగా తన చెల్లెలి దగ్గరికెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడోచ్చని,తన బావ విశ్వకర్మతో సంబంధం కలుపుకొని తన బావకి వరకట్నంగా ఇచ్చిన తన తండ్రి ఆస్తిని వడ్డీతో సహా అతని నుంచి రాబట్టాలని నిర్ణయించుకున్నాడు.తల్లి భానుమతి వెంటనే తన మొక్కుబడులు తీర్చుకోవడానికి గుళ్ళకి బయలుదేరింది.

లేటుగా వచ్చిన ఉద్యోగంతో గ్రేట్ రిలీఫ్ సాధించిన బాల గర్వంగా బ్యాగెత్తుకుని తన ఊరు మధనపల్లికి బయలుదేరాడు.బాలకి ఇంట్లో ఘన స్వాగతం లభించింది........ఈ మూడేళ్ళలో  ఎప్పుడూ తన తల్లితండ్రుల మోహలలో ఆనందాన్ని చూడలేదు బాల.చాల రోజుల తరవాత వాళ్ళ ఆనందాన్ని చూసి అప్రయత్నంగా అతని కళ్ళు వర్షించాయి.నాలుగు చుక్కల కన్నీరు బాల చెంపలపై జారింది.
భోజనాలు అయ్యాక ఇన్నాళ్ళు తనకు ఉద్యోగం లేదని తనని, తన తల్లితండ్రులని త్రివిక్రం పంచ్ డైలాగులతో వెక్కిరించి, అవమానించిన బంధువులపై రాజమౌళి సినిమాలో హీరోలా
పగ తీర్చుకోవాలని నాన్న శివకృష్ణ TVS50 లో బయలుదేరాడు బాల.
ముందుగా తనకి ఉద్యోగం వస్తేగాని  పిల్లనివ్వమని ఘోర అవమానం చేసిన మేనమామ విశ్వకర్మ ఇంటివైపు వెళుతున్నాడు బాల.
అతని TVS 50 గంటకు 20 మైళ్ళ వేగంతో మధనపల్లె మట్టిరోడ్డుపై దూసుకుపోతుంది.రోడ్డు ప్రక్కనున్న గుడిలోని శ్రీ వీరాంజనేయ స్వామి వారికి బండిపై వెళ్తూనే నమస్కరించాడు బాల.ఆ గుడి దాటాక కొంచెం దూరంలోనే బాలకృష్ణ మామ విశ్వకర్మ ఫ్యామిలీ ఉండేది.
బాలకృష్ణకి మామ కూతురు విశాలాక్షి గుర్తొచ్చింది.తన జాబ్ విషయం చెప్పి ఎలా స్టైల్ కొట్టాలో మనసులోనే రిహార్సల్స్  చేస్తూ వెళ్తున్నాడు.
ఇంతలో రోడ్డుకి ఎడమ ప్రక్కన పార్కు చేసిన అంబాసిడర్ కారుని డ్రైవెర్ రివర్స్ గేరులో సడెన్ గా రోడ్డు పైకి తెచ్చాడు.బాలకృష్ణ  సడెన్ బ్రేకేసి బండిని రైట్ కి  తిప్పినా అతని ఎడమ కాలు అంబాసిడర్ని 10km వేగంతో డీకొట్టింది.ఎడమ మోచిప్ప కి 18cm  కింద ఎముక విరిగిపోయింది.బాలకృష్ణకి ఏంజరుగుతుందో తెలిసేలోపే జరగాల్సిన దారుణం జరిగిపోయింది.కెవ్వుమని కేక వేసి బాల రోడ్డుమధ్యలో పడిపోయాడు.TVS 50....50meters ట్రావెల్ చేసి ప్రక్కనున్న  కాలవలో పడిపోయింది. కారు డ్రైవర్ సిగ్గు లేకుండా డ్రైవ్ చేసుకుని పారిపోయాడు.జనాలు  బెల్లం చుట్టూ ఈగలు మూగినట్లు మూగారు. ఎవడో పుణ్యాత్ముడు  108 కి ఫోన్ చేసాడు.సూర్యుడు వేగంగా మదనపల్లి కొండల చాటున జారిపోతున్నాడు.. 

కొన్ని గంటల తరువాత మత్తులోనుంచి బయటికి వచ్చాడు బాల,కళ్ళు తెరవగానే   గాలిలో కట్టేసి ఉన్న తన  కాలు కనిపించింది.దానికి మోకాలి నుంచి అరికాలు దాక ఆరెంజ్ కలర్ కాటన్ బట్టతో డ్రెస్సింగ్ చేసుంది ..దెబ్బ తగిలిన ఎడమ చేతికి కట్టు ఉంది  ..  కుడిచేతి నరానికి  needle గుచ్చి ఉంది....పక్కనే అయుదడుగుల ఎత్తులో ఉన్న  saline bottle నుంచి liquid nacl అతని నరాలలోకి వెళుతూ ఉంది.. నెమ్మదిగా నొప్పి తెలుస్తూ ఉంది.
ఒకసారి చుట్టూ చూసాడు బాల...అమ్మ,నాన్న,తను ఎవరెవరి బంధువలని కలవాలనుకున్నాడో వాళ్ళల్లో సగంలో సగం మంది అక్కడే ఉన్నారు.బాల గురించి వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుంటున్నారు.
ముందుగా బాల కళ్ళు తెరిచిన విషయం భానుమతి గమనించింది.వెంటనే బాలకి జ్యూస్ ఇచ్చింది మత్తు దీక్ష విరమింపచేస్తునట్లు ......శివకృష్ణ గారు కొడుకు మీద ప్రేమతో , చెల్లెలితో సంబంధం కలుపుకునే ఛాన్స్ పొతుందేమోననే భయంతో దాదాపు డిప్రెషన్లో ఉన్నాడు.నర్సు వచ్చి మందుల చీటీ ఇవ్వడంతో బయటికి వెళ్లాడాయన.
బంధువులందరు ఒకసారి బాల వైపు జాలిగా చూసారు.ఆ చూపులతో బాల భయపడిపోయాడు....నర్సు ఇచ్చిన వార్నింగ్ తో బంధువులు అందరూ నెమ్మదిగా కనుమరుగయ్యారు.
విశాలాక్షి రాకపోవడం బాలని బాగా బాధించింది.బావ నువ్వంటే ప్రాణం.త్వరగా ఉద్యోగం.. వస్తే త్వరగా పెళ్లి చేసుకుందాం.......రోజూ రివైండ్ చేసిన టేప్ రికార్డర్ లా 100 సార్లు ఇదే మాట చెప్పేది.కాని అవన్నీ అబద్ధాలని నిరూపిస్తూ  హాస్పిటల్ కి కిలోమీటర్ దూరంలో ఉన్నా బాలని చూడటానికి రాలేదు విశాలాక్షి.
ఎన్నెన్ని  కలలు కన్నాడు..ఎంతగా ఊహించుకున్నాడు తనని.కార్యేషు దాసి ,కరణేషు మంత్రి ,భోజ్యేషు మాత,శయనేషు రంభ...ఇలా ఎంతో ఊహించుకున్నాడు.కాని తను
కార్యేషు దోషి,కరణేషు కంత్రి,భోజ్యేషు దాత,జంబలకడి పంబ..... అని బాలకి ఇప్పుడు బాగా అర్థమయ్యింది..
బాలకి ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది.కొన్ని గంటల క్రితం TVS 50 లో 20km వేగంతో దూసుకెళ్లిన తనేనా ఇలా మంచంపై ఉంది.

2nd chapter.

బాలాకి  రోజులు భారంగా గడుస్తున్నాయి.
సెలైన్లు,ఇంజెక్షన్లు,టాబ్లెట్లు......
రోజుకోసారి కాలుని కిందకి దింపి డ్రెస్సింగ్ చెయ్యడం,రాత్రంతా  కాలినొప్పితో నిద్రరాకపోవడం,పగలంతా విశాలాక్షి రాలేదని బాధతో నిద్రపోకపోవడం, joining date దగ్గరికి వచ్చేసింది.ఇన్ని ఆలోచనల మధ్యలో బాలకి మరో పెద్ద డౌటు వచ్చింది.
అసలు నడవగాలనా...లేదా! అంతే డీలాపడిపోయాడు బాల.
ఇంతలో రౌండ్స్ కి వచ్చిన డాక్టర్ రేపు ఫిజియో వచ్చి నడిపిస్తారు అని చెప్పాడు.
రేపు తేలిపోతుంది తన బ్రతుకేంటో..అనుకున్నాడు బాల.

ఆ పక్క రోజు బాల కళ్ళు చాటంత  చేసుకుని ఫిజియో కోసం ఎదురుచూస్తున్నాడు.
నర్సు వచ్చి ఫిజియో రాలేదని చెప్పింది.disappoint అయ్యి కళ్ళు మూసుకున్నాడు బాల.ఇంకోరోజు ఎదురుచూడాల? అనుకొంటుండగా డాక్టర్ గారు వచ్చి నడిపిస్తారు...no problem అని చెప్పింది నర్సు.అంతే బాల కళ్ళు మళ్లీ చాటంత అయ్యాయి.
డాక్టర్ కోసం మద్యాహ్నం  వరకు ఎదురు చూసి బాల మెల్లగా నిద్రపోయాడు.భానుమతమ్మ బాలా దగ్గరే కూర్చుని డాక్టర్ కోసం చూస్తూ ఉంది.
ఇంతలో ఇద్దరు నర్సులు వెంటరాగ బాల రూంలోకి ఎంటర్ అయ్యింది డాక్టర్.....రాగానే బెడ్ కి  వేలాడేసి ఉన్న రిపోర్ట్స్ చూసింది.......
శివలెంక బాలకృష్ణ.age:24..male...బాలకృష్ణ....బాలు....ఆ పేరు చదువుతుంటే డాక్టర్ గుండె వేగం పెరిగింది.....
ఇంతలో భానుమతమ్మ బాలాని నిద్రలేపింది.నిద్ర మత్తులో లేచి ఆవులిస్తూ, కళ్ళు తుడుచుకుని డాక్టర్ని చూసిన బాల తెరిచిన నోరు మూయడం మర్చిపోయాడు.
ఆమె ముఖంలో అదే ప్రశాంతత,కళ్ళలో అదే వెలుగు.పెదవులపై అదే చిరునవ్వు.
ము.....న్ని....అప్రయత్నంగా పలికాయి బాల పెదవులు.ఆ రూంలో నిశబ్ధం అలుముకుంది........కాలెండర్ పేజీలు  గాలికి ఎగురుతున్నాయి.            



అప్పుడు.....
2003...బాల intermediate రెండో సంవత్సరం చదువుతున్న రోజులు.......inter మొదటి సంవత్సరంలో మొదటి బెంచీలో కూర్చుని పాఠాలు శ్రద్ధగా విన్న బాల......నెలకో బెంచి వెనక్కి వెళుతూ రెండవ సంవత్సరానికి వచ్చేసరికి పూర్తిగా చివర బెంచీకి చేరాడు.ఆ చివర నాలుగు బెంచీలకి లీడర్ గంధం శివ .....ఇద్దరికి పరిచయం పెరిగింది.శివ పిరికివాడు కాని ధైర్యవంతుడిలా నటిస్తూ,ఏవో యాక్షన్ సినిమాలో సీన్స్ చెపుతూ ఆ నాలుగు బెంచీలకి లీడర్ గా చెలామణి అవుతున్నాడు.

నాలుగు  రోజుల్లోనే బాల శివల పరిచయం బాగా  పెరిగిపోయింది.ఎంతగా అంటే ఒకరి లవ్ లెటర్స్ మరొకరితో రాయించేంత......
అవును శివ M.P.C subjects చదవకుండా 2nd year BI.P.C చదువుతున్న ఒకమ్మాయికి సైట్ కొట్టేవాడు.
ఆ అమ్మాయి ఎవరిని చూసినా తననే చూస్తుందని ఊహించుకునేవాడు....
ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమని ,అందుకే నన్ను చూస్తుందని last benches లోని  మిత్రులందరికీ పార్టీలు కూడా ఇచ్చాడు.
కాని మిత్రులెవరు తన మాట నమ్మడం లేదని శివకు మెల్లిగా అర్థమయ్యింది.....ఆ అమ్మాయి నిజంగా తనను ప్రేమిస్తే తప్ప వాళ్ళు నమ్మరని,తన క్రేజ్ పెరగదని తెలుసుకుని ఆ అమ్మాయికి ప్రేమలేఖ రాయాలని నిర్ణయించుకున్నాడు.
                                  కాని శివ చేతివ్ర్రాత దరిద్రంగా ఉంటుంది.పైగా ఏమి రాయాలో ఎలా రాయాలో అస్సలు అర్థం కావడంలేదు.అప్పుడే శివకి క్లాసులో లెసన్స్  వినకుండా కవితలు రాసే బాల గుర్తుకువచ్చాడు.
బాలని ఊరి మధ్యలో ఉన్న కొండపైకి తీసుకెళ్ళి తన ప్రేమకథకి కాస్త మసాల  వేసి చెప్పి తనకో ప్రేమలేఖ రాసివ్వమని కోరాడు శివ.
స్నేహితుడి ప్రేమ కోసం తనలో నిద్రపోతున్న కవిని బలవంతంగా నిద్ర లేపి వాడికి టీలు కాఫీలు ఇచ్చి రెండు రాత్రులు కష్టపెట్టి   ప్రేమలేఖని పూర్తిచేసాడు బాల.
గంధం శివ ఆ ప్రేమలేఖని చదువుతూ గాలిపటంలా.. కాసేపు గాలిలో విహరించాడు.తనని చూసి కాకపోయున కనీసం ఈ ప్రేమలేఖ చూసైన తనని ప్రేమిస్తుందనే నమ్మకం కలిగింది..కాని ఎందుకో ఎడమ ముక్కు అదిరింది శివకి. ..లెటర్ బయటపెడితే?? అసలే ప్రిన్సిపాల్ చండశాసన ముండావాడు ..లెటర్ ఇద్దాం.. గొడవ కాకపొతే మెల్లిగా రాసింది తానేనని చెబుదామని డిసైడ్ అయ్యాడు శివ.
lunch break లో ఎవరు లేని సమయంలో bi.p.c రూంలోకి నక్కలా దూరిన శివ ప్రేమలేఖని ఆ అమ్మాయు బుక్ లో పెట్టాడు.

"ప్రియమైన మున్నిసా.."
మీరంటే నాకెంతో ఇష్టం..
ఎంత ఇష్టం అంటే ఈ పేపర్ పై రాయలేనంత..
మీకు కూడా వివరించి చెప్పలేనంత..
ఈ ప్రపంచంలోని ఖాళి ప్రదేశాలు పట్టనంత..ఇష్టం.
 ప్రియా..
మొదటిసారి నిన్ను చూసినప్పుడు ..
నా హృదయమనే సముద్రంలో పైకి లేచాయు ప్రేమ అలలు..
అప్పటినుంచి కంటూనే ఉన్నాను ఎన్నో కలలు..
దయచేసి వాటిని చెయ్యొద్దు శిలలు..
ప్రియా..
నిన్ను చూసినప్పుడు మౌనం నా బాష..
నీ పరోక్షంలో మనసంతా నీ ధ్యాస..
నువ్వు కాదంటే ఆగిపోతుంది నా శ్వాస..
ప్రియా..
ఒక్క క్షణం నన్ను ఊపిరి తీసుకోనివ్వు..ఒక్కోసారి నీ ఆలోచనలతో ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతున్నాను..

                                                                                                                            ఇట్లు...నీ...


లెటర్ చదువుతున్న మున్నిసా బేగం అలియాస్ మున్ని ఊపిరి గట్టిగా పీల్చి తల విదిల్చింది..పక్కనే కూర్చుని మున్నితో పాటు ఆ లెటర్ని చదివిన ఝాన్సీ కళ్ళు ఎర్రబడ్డాయు..
మున్నీసాబేగం చాలా మంచి అమ్మాయి.ఇలాంటి లెటర్స్ ఎన్ని వచ్చినా చించేస్తుంది తప్పితే ప్రిన్సిపాల్ కి  complaint చెయ్యదు.ఝాన్సి మున్నికి classamte cum benchmate .ఝాన్సి కూడా మంచి అమ్మాయి,కాని ప్రిన్సిపాల్ కూతురు కావడంతో పొగరెక్కువ.ఇలాంటి లెటర్స్ తనకు కాకుండా ఎవరికొచ్చినా వాటిని తీసుకుని... డాడీ అంటూ ప్రిన్సిపాల్  కి అందించేది.ఇప్పుడూ అదే చేసింది.
  లవ్ లెటర్ చదివిన ప్రిన్సిపాల్ పురుషోత్తం అలియాస్ పురు గొంగళి పురుగులా ఎగిరెగిరి పడ్డాడు.వాళ్ళని వదిలేస్తే రేపు తన కూతురికే రాస్తారని భయపడ్డాడు.చర్య తీసుకోవాలంటే ముందు వాడెవడో కనిపెట్టాలి...స్క్వాడ్ బయలుదేరింది....చిన్న కాలేజ్ కావడంతో అబ్బాయిల పుస్తకాల సేకరణ పెద్ద కష్టం కాలేదు....అందరి పుస్తకాలని పరిశీలించారు.
బాల అడ్డంగా,నిలువుగా,మొత్తంగా దొరికిపోయాడు.
ఆఫీస్ రూం నుంచి బాలకి పిలుపొచ్చింది.అప్పటికే విషయం వైరస్ లా .. కాలేజ్ మొత్తం వ్యాపించింది.బాలాకి పిలుపు రావడంతో ఆ లెటర్  రాసింది బాలాయేనని అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు.M.P.C అమ్మాయిలైతే బాలాని casanova 2001 టైపులో ఊహించేసుకున్నారు.
బాలాకి విషయం అర్థమయ్యింది.గంధం శివకి భయమేసింది.వెళ్లి తన పేరు ఎక్కడ చేపుతాడోనని బాలా వైపు బేలగా  చూసాడు.
బాలా ధైర్యం చెప్పి ఎట్టి పరిస్థితుల్లో నీపేరు చెప్పానని ప్రమాణం చేసి, ప్యూను తోడు రాగా ఆఫీస్ రూంకి భయపడుతూ వెళ్ళాడు.

బాలాని అరగంటసేపు తిట్టాక అలిసిపోయి,లీటర్ మంచినీళ్ళు తాగి ..నాలుగు పచ్చి క్యారట్ ముక్కలు తిని రిలాక్సయ్యాడు పురు.
మున్నీసాని పిలిపించాడు పురు,బాలతో  సారీ చెప్పించడానికి .
మున్నీ వచ్చి బాలాకి ఎదురుగా నిలబడింది.
అప్పుడు చూసాడు బాలా మున్నీని.
వెంటనే అతని హృదయమనే సముద్రంలో ప్రేమ అలలు ఉవ్వెత్తున ఎగిసాయి.తనకి రెండడుగుల దూరంలో ఎదురుగా నిలబడి ఉన్న పాలరాతి బొమ్మని చూసి దాదాపు అతని పంచేంద్రియాలు పనిచేయడం మానేసాయి.బాలా శిలలా అలాగే నిలబడి ఆమెనే చూస్తున్నాడు.
           ఇప్పుడు ..
దాదాపు ఏడు సంవత్సరాల తరువాత ఆమెని మళ్ళీ అలాగే చూస్తూ ఉండిపోయాడు బాల.....
మున్నీ ముందుగా తేరుకుని , బాలా పరిస్థితిని చూసి జాలిపడి,భాదపడి కన్నీటిని కష్టపడి ఆపుకుని కళ్ళతోనే ధైర్యం చెప్పింది.
ఈ రోజు బాబుని నడిపిస్తారని చెప్పారు...మెల్లగా అడిగింది భానుమతమ్మ.
అవునని చెప్పి గాలిలో వ్రేలాదదీయబడి ఉన్న బాలా కాలుని నర్సు సహాయంతో బెడ్ పైకి  దింపింది మున్నీ.

ఆశ్చర్యం ఇప్పుడు బాలకి నొప్పి తెలియడం లేదు.మున్నీనే చూస్తూ ఉన్నాడు.
హృదయమనే సముద్రంలో అలలు మళ్ళీ ఇప్పుడు పైకి లేచాయి.
కళ్ళ ముందు ఉన్న మున్నీని చూస్తుంటే రెప్ప వేయలేకపోతున్నాడు బాలా.
ఒంటికి వైట్ కోట్,మేడలో స్టెతస్కోప్,అంతే... ఇంకేం మారలేదు మున్నీ.
అదే అందం.నిజం చెప్పాలంటే తన అందం ఇంకా పెరిగింది.వైట్ కోట్ లో angel లా ఉంది.
నెమ్మదిగా బాలా కాలిని కిందకి దింపింది మున్నీ.
దాదాపు ఏడురోజులు తరవాతః అతని ఎడమ కాలు నేలని తాకింది.

ఒకవైపు భానుమతమ్మ,మరోవైపు మున్నీ సాయం చేస్తుంటే ఎడమ కాలుని పైకి లేపాలని ప్రయత్నిస్తున్నాడు బాలా.
కాని అతనివల్ల కావడం లేదు.నెమ్మదిగా నొప్పి తెలుస్తుంది.ఎంత ప్రయత్నించినా అడుగు పడటంలేదు.ఇక నావల్ల కాదంటూ మున్నీ కళ్ళలోకి చూసాడు బాలా.
కార్తీకపౌర్ణమి రోజు కోనేటిలో వెలుగుతున్న దీపాల్లాంటి కళ్ళతో బాలాకి ధైర్యం చెప్పింది మున్నీ.
భారం మున్నీపై వేసి గట్టిగా దేవుణ్ణి తలుచుకుని తన ఒంట్లోని సత్తువంతా ఉపయోగించి అడుగు తీసి ముందుకు వేసాడు బాలా. భానుమతమ్మ కళ్ళలో వెలుగు.అప్పుడే వచ్చిన శివకృష్ణ కళ్ళ లో ఆనందం.
బాలా నడుస్తున్నాడు......నమ్మలేకపోతున్నాడు బాలా.కొన్ని క్షణాల క్రితం నడవలేనని నిస్పృహ పడిన బాలా ఇప్పుడు నడుస్తున్నాడు.నెమ్మదిగా అడుగు తీసి అడుగు వేస్తున్నాడు.హాస్పిటల్ కారిడార్లో మున్నీ,భానుమతి సాయంతో ఏడో అడుగు వేసిన బాలా  మున్నీ కళ్ళలోకి చూసాడు.

                                                                                                                                       ఇంకా ఉంది..


                                                                                                                                      

Wednesday, March 3, 2010

జయన్న కేఫేలో రెండో రోజు.

డాలోడు..

మహిని కలవడానికి నేను రోజూ సాయంత్రం కేఫేకి వెళ్ళేవాడిని..మహి మెడికల్ షాప్ లో బిజీ కావడంతో చెప్పిన టైముకి ఒక అరగంటో..గంటో..ఆలస్యంగా వచ్చేవాడు..
నేనొక్కడినే కూర్చుని పేపర్ చదువుతూ ఉండేవాడిని..అప్పుడు పరిచయమయ్యాడు సుధాకర్ ..
బక్క శరీరం , చెదిరిన జుట్టు.. నడకలో తేడ..కళ్ళల్లో నిర్లక్ష్యం..కలిపితే సుధాకర్.
సుధాకర్: ఏమి చేస్తుంతావ్?సిగిరెట్ వెలిగిస్తూ అడిగాడు.
నేను: b.tech 2nd year..mech.
సిగిరెట్ ఆఫర్ చేసాడు..నో థాంక్స్..అన్నాను
సుధాకర్ : నేను b.tech 2nd year..civil engg..
hyd lo c.b.i.t తెలుసా?
నేను: హా తెలుసు..
సుధాకర్: అందులో..
నేను: ఓహ్  అవునా..నా ఫ్రెండ్ కూడా c.b.i.t లోనే civil engg 2nd year..పేరు సంజీవ్ ..
సుధాకర్: తను నా జూనియర్..
నేను: అదేంటి.మీరు 2nd year కదా ?
సుధాకర్: అవును..లాస్ట్ ఇయర్ discontinue చేసాను ..
నాకు ఎక్కడో చిన్న డౌట్ వచ్చింది.కాని అతను చాలా  నిజాయుతిగా చెప్తున్నాడు..
నేను: కొంచెం బాధపడి......ఓహ్..అవునా? ఏమైంది?
సుధాకర్: విరక్తి నవ్వు నవ్వి..చిన్న లవ్ affair అన్నాడు..
నేను : మొదటి పరిచయంలోనే అన్ని నాతొ చెప్తున్నాదేంటి?అని సందేహంలో ఉన్నాను..తను కంటిన్యూ చేసాడు..
సుధాకర్: ఫస్ట్ ఇయర్ లో పరిచయమైంది..తన పేరు సుశ్రుత[?]
ఇద్దరం లవ్ చేసుకున్నాం.వాళ్ళ ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదు..తనకి వేరే సంబందాలు చూస్తుంటే..లేచిపోయాం
[అయ్యా బాబొయు..నా ఊత పదం...నేను షాక్ అయ్యాను..నా లైఫ్ లో లేచిపోయున వ్యక్తి తో మాట్లాడటం అదే ఫస్ట్ టైం]

సుధాకర్: మంత్రాలయం వెళ్లి పెళ్లి కూడా చేసుకున్నాం..
నాకు షాకింగ్ గా ఉంది..ఈ బక్కోడు ఒక అమ్మయుని లేపుకెల్లి పెళ్లి చేసుకున్నాడ?ఓహ్ దేవుడా..
సుధాకర్: చాల మాములుగా సిగిరెట్ కాలుస్తూ ..తర్వాత హైదరాబాద్ వెళ్ళాం..సుశ్రుతాని వాళ్ళింట్లో దించాను..

అంతా కొత్తగా ఉంది..అప్పుడు నా వయస్సు 19 yrs..అప్పటివరకు మా batch లో ప్రేమించిన వాళ్ళు ఇద్దరో ముగ్గురో ...వాళ్లనే వింతగా చూసేవాడిని....
ఇలా లేచిపోయు పెళ్లి చేసుకోన్న వాళ్ళ గురించి వినడమే గాని ఎప్పుడు చూడలేదు.
అందుకే అతన్ని చూస్తూ ఉన్నాను..
ఒకమ్మాయు అన్నీ వదిలి అతనితో వెళ్లిందంటే అతనిలో ఏదో speciality ఉంటుంది. అదేంటా అని ఆలోచిస్తున్నాను..

సుధాకర్: పెద్ద గొడవయుంది..వాళ్ళ నాన్న గుండాలతో..నన్ను కొట్టించాడు..
తరువాత పోలీసు కేసు పెట్టారు..నన్ను జైల్లో వేసారు..
నేను: అయ్యా బాబొయు..
సుధాకర్: కలెక్టర్ తెలుసు కదా?అదే మన నెల్లూరు కలెక్టర్ ..ఆయన మా బాబాయు..ఆయనే విడిపించారు..
తర్వాత మా నాన్నగారు భయపడి నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసారు..

తాగుతున్న సిగిరెట్ పడేసి మళ్ళి వెంటనే ఇంకోటి వెలిగించాడు..
నాకైతే అతనితో ఎం మాట్లాడాలో అర్థం కావట్లేదు..
వాళ్ళ బాబాయు కలెక్టర్ ..బాగా  డబ్బున్నవాడు కావొచ్చు..అంతే..
అతనిలో మాత్రం ఏ స్పెషాలిటి లేదు..infact తను రోగిష్తి వాడిలా ఉన్నాడు..లవ్ లో ఫెయిల్ అయ్యాక ఇలా అయ్యాడ?

సుధాకర్:మళ్లీ విరక్తిగా నవ్వి ..ఏంటలా చూస్తున్నావ్?అన్నాడు..
కొంత మందికి ఇలాంటి వాళ్ళు చాల గొప్ప.
నేను అదే ఆలోచిస్తున్నాను..ఇతను గ్రేటా ?కాదా ..?

ఇంతలో మహి వచ్చాడు..నేను గమనించే పరిస్థితిలో లేను..
దగ్గరికి వచ్చి తట్టాడు..
సుధాకర్, మహిని పలకరించాడు ..మహి చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు..
అక్కడ చైర్ వేస్తున్న సుబ్బుతో దూరంగా వెయ్యమని చెప్పాడు..
నేను సుధాకర్ కి బై చెప్పి ...వెళ్లి మహితో కూర్చుని సిగిరెట్ వెలిగించాను..మనసంతా ఏదోలా ఉంది..సుధాకర్ నే చూస్తున్నాను..

అది గమనించి మహి ..ఏంట్రా అలా ఉన్నావ్ ?అన్నాడు..
నేను చెప్పాలా? వద్దా? అని ఆలోచించలేదు..ఎందుకంటే అడిగింది మహి ..
సుధాకర్ నాతొ చెప్పిన అతని స్టోరీని shortcut లో చెప్పి బాధపడుతుంటే..మహి చిన్నగా నవ్వి నా వైపు జాలిగా చూసాడు..
అరేయ్ నువ్వంత ఫీల్ అవ్వకు..
వాడికి ఇంకో పేరు ఉంది ఇక్కడ తెలుసా?
?????????
డాలోడు..చెప్పాడు మహి.

అవునురా మేమంతా అలానే పిలుస్తాం ...
వాడు చెప్పేవాన్ని అబద్ధాలే..
వాడి ఉద్దేశం తనను అందరు గొప్పగా అనుకోవాలని అంతే..మోసం చెయ్యాలని కాదు..
అంటే..ఇప్పటి వరకు తను చెప్పింది అభద్దమా?ఇదో కొత్త షాక్ నాకు.
డౌట? కొత్తల్లో నాకు ఇలాంటి  కథలు చాల చెప్పాడు..నెల్లూరు జిల్లాకి ఎ కలెక్టర్ వచ్చినా మా బాబాయ్ అనో పెదనాన్న అనో చెప్తాడు..నీకు చెప్పే ఉంటాడే..
హా..అవును..
సంభందం లేకుండా మాట్లాడతాడు..కావలిలో రుపాయు మిద్దె [బాగా ఫేమస్ ] మాదే అంటాడు..మా మామయ్య కి ratan tata బాగా క్లోజ్ అని,మా అన్నయ్య us లో senator అని  ఒకటి కాదులేరా..చెప్తున్నాడు మహి.
నేను షాక్ లో ఉన్నాను..సుధాకర్ వైపు చూసాను..ఎవరినో కూర్చోబెట్టుకొని ఏదో చెప్తున్నాడు..
నాకు చెప్పిన కథో..లేక కొత్తదో..

మా ఊరిలో ఇలా అబద్ధపు  కథలు చెప్పటాన్ని డాల్ వేస్తున్నాడు అని ,చెప్పేవాడిని  డాలోడు అంటారని ఆ రోజే జయన్న కేఫ్ లో తెలుసుకున్నాను..