Tuesday, March 2, 2010

ఏ మాయ చేసావే... నా అభిప్రాయం.




ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయులుండగా నేను జెస్సినే ఎందుకు ప్రేమించాను?
actuval గా నేను జెస్సిని choose చేసుకోలేదు ..నన్ను పడేసింది ప్రేమ..

ఇలాంటి రొమాంటిక్ , క్లాసి dialogues ప్రేక్షకులని ఎక్కడికో తిసుకేల్లాయు..
గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమా చూస్తుంటే కొంతమంది వ్యక్తుల జీవితాలు కళ్ళ ముందు కదులాడుతాయు..
మీరు ధియేటర్ నుంచి ఇంటికొచ్చినా .. కార్తీక్..జెస్సి..మీ మనసులో తిరుగుతూ ఉంటారు ..అదే గౌతమ్ చేసే మాయ..

surya s/o krishnan కి ముందు తను తీసిన సినిమాలకి ఈ రెండు సినిమాలకి ఒక తేడా ఉంది....
ఈ రెండు గౌతమ్ వాసుదేవ్ మీనన్ లైఫ్ లో ఫేస్ చేసిన పరిస్థితుల ప్రభావంతో రాసుకున్న కథలు..అందుకే ఈ రెండు మనస్సుని తాకుతాయు..కాకపొతే కొంత మంది మనస్సులనే తాకుతాయి..
కాని
ముఖ్యంగా ఈ సినిమాలో గౌతం దర్శకత్వం, production values,manoj సినిమాటోగ్రఫీ,a.r rahman music .. lead actors మధ్య chemistrey,romance,jessi samantha,..జెస్సి కి
dubbing చెప్పిన artiste husky వాయిస్..అందరిని ఆకట్టుకుంటాయు.

సినిమా కథ గురించి తక్కువ మాట్లాడతాను ..
పాజిటివ్ attitude ఉన్న కుర్రాడు కార్తిక్ కి,confusion conflict తో సతమతమయ్యే జెస్సి కి మద్య ఎం మాయ జరిగిందో ..

లవర్ పెళ్లి కి వెళ్లి కుర్చోవాలంటే చాల postive attitude ఉండాలి .. అంతగా ప్రేమించినా అమ్మయుకి పెళ్లైందని తెలిసినా తన career ని కాపాడుకున్నాడు..అలాంటి పాజిటివ్ attitude మనిషికి చాల ముఖ్యం ..

ఈ సినిమాలో జెస్సి ,కార్తీక్ షూటింగ్ లో బిజీ అయ్యాక తనని నిర్లక్ష్యం చేస్తున్నాడనే ఫీలింగ్ కలిగాక,karthik profession గురించి ఒక మాట అంటుంది..
"నాకు సినిమాలంటే ఇష్టం లేదు.."

కార్తీక్ లానే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు..తను ఇలానే డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు.ఇంతలో ఒక అమ్మాయుని ప్రేమించాడు.ఆ అమ్మాయు అతన్ని ప్రేమించింది..కొన్నాళ్ళ తరువాత నా ఫ్రెండ్ కి asst director గా ఛాన్స్ వచ్చింది ..
అతను ఈ విషయం అమ్మయుతో చెప్పాడు.. ఆ అమ్మాయు తనకి సినిమాలంటే ఇష్టం లేదని ఏదో ఒక ఉద్యోగం చూసుకోమని చాల బాధపడుతూ చెప్పింది..తను షాక్ అయ్యాడు..

అతను: విషయం ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు.
ఆమె :నీ నిర్ణయం మార్చుకుంటావని ఎదురు చూసాను .
అతను:జీవితంలో కొన్ని నిర్ణయాలు మార్చుకోలేము..
ఆమె:నా ప్రేమ కోసం నీ నిర్ణయం మార్చుకోలేవా?
అతను:నీ కంటే ముందు నేను సినిమాని ప్రేమించాను.
ఆమె:సరే అయుతే నన్ను మర్చిపో..
అతను:ఎందుకంత కఠినంగా మాట్లాడతావ్?
ఆమె: విషయంలో మాత్రం నేనింతే ..సినిమాలని వదులుకుంటావా లేదా?
అతను:నీ ప్రేమ కోసం సినిమాని వదులుకుంటాను..కాని తర్వాత డైరెక్టర్ అవ్వలేకపోయాననే దిగులుతో మందుకో..ఇంకోదానికో బానిసనై నిన్ను వదిలేస్తాను..ఓకే ?
ఆమె:మౌనం..
అతను:నేను ముందు సినిమా ని ప్రేమించాను.. తర్వాతే నిన్ను ప్రేమించాను..నీకోసం దాన్ని,ఇంకోదాని కోసం నిన్ను వదలేస్తూ పోతే ...నా పైన నాకే అసహ్యం కలుగుతుంది..
ఆమె:నువ్వో డైరెక్టర్ వి ..బాగా మాట్లాడతావ్..నేను నీతో మాటల్లో గెలవలెను..నా నిర్ణయం మార్చుకోలేను అంది..
అతను ,ఆమె విడిపోయారు.
మంచి సీన్ ..ఆ situation పేస్ చేసిన వాళ్ళే అది రాయగలరు..వాళ్ళే తియ్యగలరు..

ఈ సినిమాలో ఒకే ఒక్క లోపం కనిపించింది నాకు..జెస్సి వాళ్ళ నాన్న గురించి కేవలం మాటల్లో చెప్పకుండా ఆ character ని కొంచెం establish చేసుంటే జెస్సి బాధ ప్రేక్షకులకి సరిగ్గా అర్థమయ్యేది..
చివరలో జేస్సితో తన క్యారెక్టర్ గురించి తనతోనే చెప్పించి మంచి పని చేసాడు గౌతమ్..
అందమైన అమ్మయులకి ఏదో ఒక లోపం ఉంటుంది.jessi characterization ఆ way లో కూడా కరెక్టే..

జీవితంలో ఓడిపోయున కథతోనే సినిమా తీసి విజయం సాదించడం [చివరలో postive ట్విస్ట్ పక్కన బెడితే ]అనేది గమ్మత్తుగా ఉంది కదా..?

నువ్వో దారిలో ఉంటావ్..నువ్వేదో సాదించే పనిలో ఉంటావ్..అలాంటప్పుడు ఇలాంటి మాయేదో జరిగినా నీ దారిని,నీ ఆశయాన్ని మర్చిపోకు మిత్రమా..

Friday, February 26, 2010

rv నీకు బ్లాగింగ్ ఎందుకు?


1 2 3

కారణాలు మూడు.
1.కొన్ని నెలల క్రితం పాత బ్లాగ్ ని మూసేసినందుకు ..
2.ఈ మద్య నా మిత్రులు బ్లాగింగు చెయ్యడం చూసి ఉత్తేజం పొందినందుకు ..
3.ప్రవాహంలా సాగే ఆలోచనల ఉనికిని బద్రపరచడానికి.

Wednesday, February 24, 2010

జీవితంలో..

జీవితంలో ఏదైనా కోల్పోవడానికి సిద్దంగా ఉండండి.
మీపై మీకున్న నమ్మకాన్ని,
మీ భవిష్యత్తుపై మీకున్న ఆశలని తప్ప..ఎందుకంటే
అవే మిమ్మల్ని "బ్రతికిస్తాయు..నడిపిస్తాయు ..గెలిపిస్తాయు"..