Tuesday, March 9, 2010

అప్పుడు.. ఇప్పుడు..ఓ ప్రేమకథ.

ఇప్పుడు..

gmail లో తన మెయిల్ చూసుకున్న బాలకృష్ణ ఉద్వేగంతో పెద్దగా యాహూ అని అరిచాడు.
బాలకి job confirm చేస్తూ పుణే లోని ఒక software company H.R department పంపిన మెయిల్ అది.
బాల ఇంజనీరింగ్ లో సబ్జెక్ట్ నేర్చుకున్నా..... communication skills లేకపోవడంతో మూడేళ్ళు  ఖాలిగా  గడపాల్సి వచ్చింది.
అమీర్ పేటలో  నెలకో కొత్త software course బట్టీ పట్టినా ఉద్యోగం రాలేదు.ఇప్పుడు కూడా అతని స్నేహితుడొకడు ఆ కంపెనీ H.R department లో పనిచేస్తుండటం వల్ల బాలకి  ఈ ఉద్యోగం వచ్చింది.మనసులోనే స్నేహితుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
పెద్ద కంపెనీ....పెద్ద జీతం....ఇంకేముంది పెళ్లి చేసుకోవచ్చు.వెంటనే స్నేహితుడి మొబైల్ తీసుకుని ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి శుభవార్త చెప్పాడు.
బాల నాన్న శివకృష్ణకి  గొప్ప రిలీఫ్ కలిగింది.మధ్యతరగతి తండ్రికి కొడుకుకి ఉద్యోగం రావడం కంటే గొప్ప రిలీఫ్ ఏముంటుంది.ఇప్పుడు దైర్యంగా తన చెల్లెలి దగ్గరికెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడోచ్చని,తన బావ విశ్వకర్మతో సంబంధం కలుపుకొని తన బావకి వరకట్నంగా ఇచ్చిన తన తండ్రి ఆస్తిని వడ్డీతో సహా అతని నుంచి రాబట్టాలని నిర్ణయించుకున్నాడు.తల్లి భానుమతి వెంటనే తన మొక్కుబడులు తీర్చుకోవడానికి గుళ్ళకి బయలుదేరింది.

లేటుగా వచ్చిన ఉద్యోగంతో గ్రేట్ రిలీఫ్ సాధించిన బాల గర్వంగా బ్యాగెత్తుకుని తన ఊరు మధనపల్లికి బయలుదేరాడు.బాలకి ఇంట్లో ఘన స్వాగతం లభించింది........ఈ మూడేళ్ళలో  ఎప్పుడూ తన తల్లితండ్రుల మోహలలో ఆనందాన్ని చూడలేదు బాల.చాల రోజుల తరవాత వాళ్ళ ఆనందాన్ని చూసి అప్రయత్నంగా అతని కళ్ళు వర్షించాయి.నాలుగు చుక్కల కన్నీరు బాల చెంపలపై జారింది.
భోజనాలు అయ్యాక ఇన్నాళ్ళు తనకు ఉద్యోగం లేదని తనని, తన తల్లితండ్రులని త్రివిక్రం పంచ్ డైలాగులతో వెక్కిరించి, అవమానించిన బంధువులపై రాజమౌళి సినిమాలో హీరోలా
పగ తీర్చుకోవాలని నాన్న శివకృష్ణ TVS50 లో బయలుదేరాడు బాల.
ముందుగా తనకి ఉద్యోగం వస్తేగాని  పిల్లనివ్వమని ఘోర అవమానం చేసిన మేనమామ విశ్వకర్మ ఇంటివైపు వెళుతున్నాడు బాల.
అతని TVS 50 గంటకు 20 మైళ్ళ వేగంతో మధనపల్లె మట్టిరోడ్డుపై దూసుకుపోతుంది.రోడ్డు ప్రక్కనున్న గుడిలోని శ్రీ వీరాంజనేయ స్వామి వారికి బండిపై వెళ్తూనే నమస్కరించాడు బాల.ఆ గుడి దాటాక కొంచెం దూరంలోనే బాలకృష్ణ మామ విశ్వకర్మ ఫ్యామిలీ ఉండేది.
బాలకృష్ణకి మామ కూతురు విశాలాక్షి గుర్తొచ్చింది.తన జాబ్ విషయం చెప్పి ఎలా స్టైల్ కొట్టాలో మనసులోనే రిహార్సల్స్  చేస్తూ వెళ్తున్నాడు.
ఇంతలో రోడ్డుకి ఎడమ ప్రక్కన పార్కు చేసిన అంబాసిడర్ కారుని డ్రైవెర్ రివర్స్ గేరులో సడెన్ గా రోడ్డు పైకి తెచ్చాడు.బాలకృష్ణ  సడెన్ బ్రేకేసి బండిని రైట్ కి  తిప్పినా అతని ఎడమ కాలు అంబాసిడర్ని 10km వేగంతో డీకొట్టింది.ఎడమ మోచిప్ప కి 18cm  కింద ఎముక విరిగిపోయింది.బాలకృష్ణకి ఏంజరుగుతుందో తెలిసేలోపే జరగాల్సిన దారుణం జరిగిపోయింది.కెవ్వుమని కేక వేసి బాల రోడ్డుమధ్యలో పడిపోయాడు.TVS 50....50meters ట్రావెల్ చేసి ప్రక్కనున్న  కాలవలో పడిపోయింది. కారు డ్రైవర్ సిగ్గు లేకుండా డ్రైవ్ చేసుకుని పారిపోయాడు.జనాలు  బెల్లం చుట్టూ ఈగలు మూగినట్లు మూగారు. ఎవడో పుణ్యాత్ముడు  108 కి ఫోన్ చేసాడు.సూర్యుడు వేగంగా మదనపల్లి కొండల చాటున జారిపోతున్నాడు.. 

కొన్ని గంటల తరువాత మత్తులోనుంచి బయటికి వచ్చాడు బాల,కళ్ళు తెరవగానే   గాలిలో కట్టేసి ఉన్న తన  కాలు కనిపించింది.దానికి మోకాలి నుంచి అరికాలు దాక ఆరెంజ్ కలర్ కాటన్ బట్టతో డ్రెస్సింగ్ చేసుంది ..దెబ్బ తగిలిన ఎడమ చేతికి కట్టు ఉంది  ..  కుడిచేతి నరానికి  needle గుచ్చి ఉంది....పక్కనే అయుదడుగుల ఎత్తులో ఉన్న  saline bottle నుంచి liquid nacl అతని నరాలలోకి వెళుతూ ఉంది.. నెమ్మదిగా నొప్పి తెలుస్తూ ఉంది.
ఒకసారి చుట్టూ చూసాడు బాల...అమ్మ,నాన్న,తను ఎవరెవరి బంధువలని కలవాలనుకున్నాడో వాళ్ళల్లో సగంలో సగం మంది అక్కడే ఉన్నారు.బాల గురించి వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుంటున్నారు.
ముందుగా బాల కళ్ళు తెరిచిన విషయం భానుమతి గమనించింది.వెంటనే బాలకి జ్యూస్ ఇచ్చింది మత్తు దీక్ష విరమింపచేస్తునట్లు ......శివకృష్ణ గారు కొడుకు మీద ప్రేమతో , చెల్లెలితో సంబంధం కలుపుకునే ఛాన్స్ పొతుందేమోననే భయంతో దాదాపు డిప్రెషన్లో ఉన్నాడు.నర్సు వచ్చి మందుల చీటీ ఇవ్వడంతో బయటికి వెళ్లాడాయన.
బంధువులందరు ఒకసారి బాల వైపు జాలిగా చూసారు.ఆ చూపులతో బాల భయపడిపోయాడు....నర్సు ఇచ్చిన వార్నింగ్ తో బంధువులు అందరూ నెమ్మదిగా కనుమరుగయ్యారు.
విశాలాక్షి రాకపోవడం బాలని బాగా బాధించింది.బావ నువ్వంటే ప్రాణం.త్వరగా ఉద్యోగం.. వస్తే త్వరగా పెళ్లి చేసుకుందాం.......రోజూ రివైండ్ చేసిన టేప్ రికార్డర్ లా 100 సార్లు ఇదే మాట చెప్పేది.కాని అవన్నీ అబద్ధాలని నిరూపిస్తూ  హాస్పిటల్ కి కిలోమీటర్ దూరంలో ఉన్నా బాలని చూడటానికి రాలేదు విశాలాక్షి.
ఎన్నెన్ని  కలలు కన్నాడు..ఎంతగా ఊహించుకున్నాడు తనని.కార్యేషు దాసి ,కరణేషు మంత్రి ,భోజ్యేషు మాత,శయనేషు రంభ...ఇలా ఎంతో ఊహించుకున్నాడు.కాని తను
కార్యేషు దోషి,కరణేషు కంత్రి,భోజ్యేషు దాత,జంబలకడి పంబ..... అని బాలకి ఇప్పుడు బాగా అర్థమయ్యింది..
బాలకి ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది.కొన్ని గంటల క్రితం TVS 50 లో 20km వేగంతో దూసుకెళ్లిన తనేనా ఇలా మంచంపై ఉంది.

2nd chapter.

బాలాకి  రోజులు భారంగా గడుస్తున్నాయి.
సెలైన్లు,ఇంజెక్షన్లు,టాబ్లెట్లు......
రోజుకోసారి కాలుని కిందకి దింపి డ్రెస్సింగ్ చెయ్యడం,రాత్రంతా  కాలినొప్పితో నిద్రరాకపోవడం,పగలంతా విశాలాక్షి రాలేదని బాధతో నిద్రపోకపోవడం, joining date దగ్గరికి వచ్చేసింది.ఇన్ని ఆలోచనల మధ్యలో బాలకి మరో పెద్ద డౌటు వచ్చింది.
అసలు నడవగాలనా...లేదా! అంతే డీలాపడిపోయాడు బాల.
ఇంతలో రౌండ్స్ కి వచ్చిన డాక్టర్ రేపు ఫిజియో వచ్చి నడిపిస్తారు అని చెప్పాడు.
రేపు తేలిపోతుంది తన బ్రతుకేంటో..అనుకున్నాడు బాల.

ఆ పక్క రోజు బాల కళ్ళు చాటంత  చేసుకుని ఫిజియో కోసం ఎదురుచూస్తున్నాడు.
నర్సు వచ్చి ఫిజియో రాలేదని చెప్పింది.disappoint అయ్యి కళ్ళు మూసుకున్నాడు బాల.ఇంకోరోజు ఎదురుచూడాల? అనుకొంటుండగా డాక్టర్ గారు వచ్చి నడిపిస్తారు...no problem అని చెప్పింది నర్సు.అంతే బాల కళ్ళు మళ్లీ చాటంత అయ్యాయి.
డాక్టర్ కోసం మద్యాహ్నం  వరకు ఎదురు చూసి బాల మెల్లగా నిద్రపోయాడు.భానుమతమ్మ బాలా దగ్గరే కూర్చుని డాక్టర్ కోసం చూస్తూ ఉంది.
ఇంతలో ఇద్దరు నర్సులు వెంటరాగ బాల రూంలోకి ఎంటర్ అయ్యింది డాక్టర్.....రాగానే బెడ్ కి  వేలాడేసి ఉన్న రిపోర్ట్స్ చూసింది.......
శివలెంక బాలకృష్ణ.age:24..male...బాలకృష్ణ....బాలు....ఆ పేరు చదువుతుంటే డాక్టర్ గుండె వేగం పెరిగింది.....
ఇంతలో భానుమతమ్మ బాలాని నిద్రలేపింది.నిద్ర మత్తులో లేచి ఆవులిస్తూ, కళ్ళు తుడుచుకుని డాక్టర్ని చూసిన బాల తెరిచిన నోరు మూయడం మర్చిపోయాడు.
ఆమె ముఖంలో అదే ప్రశాంతత,కళ్ళలో అదే వెలుగు.పెదవులపై అదే చిరునవ్వు.
ము.....న్ని....అప్రయత్నంగా పలికాయి బాల పెదవులు.ఆ రూంలో నిశబ్ధం అలుముకుంది........కాలెండర్ పేజీలు  గాలికి ఎగురుతున్నాయి.            



అప్పుడు.....
2003...బాల intermediate రెండో సంవత్సరం చదువుతున్న రోజులు.......inter మొదటి సంవత్సరంలో మొదటి బెంచీలో కూర్చుని పాఠాలు శ్రద్ధగా విన్న బాల......నెలకో బెంచి వెనక్కి వెళుతూ రెండవ సంవత్సరానికి వచ్చేసరికి పూర్తిగా చివర బెంచీకి చేరాడు.ఆ చివర నాలుగు బెంచీలకి లీడర్ గంధం శివ .....ఇద్దరికి పరిచయం పెరిగింది.శివ పిరికివాడు కాని ధైర్యవంతుడిలా నటిస్తూ,ఏవో యాక్షన్ సినిమాలో సీన్స్ చెపుతూ ఆ నాలుగు బెంచీలకి లీడర్ గా చెలామణి అవుతున్నాడు.

నాలుగు  రోజుల్లోనే బాల శివల పరిచయం బాగా  పెరిగిపోయింది.ఎంతగా అంటే ఒకరి లవ్ లెటర్స్ మరొకరితో రాయించేంత......
అవును శివ M.P.C subjects చదవకుండా 2nd year BI.P.C చదువుతున్న ఒకమ్మాయికి సైట్ కొట్టేవాడు.
ఆ అమ్మాయి ఎవరిని చూసినా తననే చూస్తుందని ఊహించుకునేవాడు....
ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమని ,అందుకే నన్ను చూస్తుందని last benches లోని  మిత్రులందరికీ పార్టీలు కూడా ఇచ్చాడు.
కాని మిత్రులెవరు తన మాట నమ్మడం లేదని శివకు మెల్లిగా అర్థమయ్యింది.....ఆ అమ్మాయి నిజంగా తనను ప్రేమిస్తే తప్ప వాళ్ళు నమ్మరని,తన క్రేజ్ పెరగదని తెలుసుకుని ఆ అమ్మాయికి ప్రేమలేఖ రాయాలని నిర్ణయించుకున్నాడు.
                                  కాని శివ చేతివ్ర్రాత దరిద్రంగా ఉంటుంది.పైగా ఏమి రాయాలో ఎలా రాయాలో అస్సలు అర్థం కావడంలేదు.అప్పుడే శివకి క్లాసులో లెసన్స్  వినకుండా కవితలు రాసే బాల గుర్తుకువచ్చాడు.
బాలని ఊరి మధ్యలో ఉన్న కొండపైకి తీసుకెళ్ళి తన ప్రేమకథకి కాస్త మసాల  వేసి చెప్పి తనకో ప్రేమలేఖ రాసివ్వమని కోరాడు శివ.
స్నేహితుడి ప్రేమ కోసం తనలో నిద్రపోతున్న కవిని బలవంతంగా నిద్ర లేపి వాడికి టీలు కాఫీలు ఇచ్చి రెండు రాత్రులు కష్టపెట్టి   ప్రేమలేఖని పూర్తిచేసాడు బాల.
గంధం శివ ఆ ప్రేమలేఖని చదువుతూ గాలిపటంలా.. కాసేపు గాలిలో విహరించాడు.తనని చూసి కాకపోయున కనీసం ఈ ప్రేమలేఖ చూసైన తనని ప్రేమిస్తుందనే నమ్మకం కలిగింది..కాని ఎందుకో ఎడమ ముక్కు అదిరింది శివకి. ..లెటర్ బయటపెడితే?? అసలే ప్రిన్సిపాల్ చండశాసన ముండావాడు ..లెటర్ ఇద్దాం.. గొడవ కాకపొతే మెల్లిగా రాసింది తానేనని చెబుదామని డిసైడ్ అయ్యాడు శివ.
lunch break లో ఎవరు లేని సమయంలో bi.p.c రూంలోకి నక్కలా దూరిన శివ ప్రేమలేఖని ఆ అమ్మాయు బుక్ లో పెట్టాడు.

"ప్రియమైన మున్నిసా.."
మీరంటే నాకెంతో ఇష్టం..
ఎంత ఇష్టం అంటే ఈ పేపర్ పై రాయలేనంత..
మీకు కూడా వివరించి చెప్పలేనంత..
ఈ ప్రపంచంలోని ఖాళి ప్రదేశాలు పట్టనంత..ఇష్టం.
 ప్రియా..
మొదటిసారి నిన్ను చూసినప్పుడు ..
నా హృదయమనే సముద్రంలో పైకి లేచాయు ప్రేమ అలలు..
అప్పటినుంచి కంటూనే ఉన్నాను ఎన్నో కలలు..
దయచేసి వాటిని చెయ్యొద్దు శిలలు..
ప్రియా..
నిన్ను చూసినప్పుడు మౌనం నా బాష..
నీ పరోక్షంలో మనసంతా నీ ధ్యాస..
నువ్వు కాదంటే ఆగిపోతుంది నా శ్వాస..
ప్రియా..
ఒక్క క్షణం నన్ను ఊపిరి తీసుకోనివ్వు..ఒక్కోసారి నీ ఆలోచనలతో ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతున్నాను..

                                                                                                                            ఇట్లు...నీ...


లెటర్ చదువుతున్న మున్నిసా బేగం అలియాస్ మున్ని ఊపిరి గట్టిగా పీల్చి తల విదిల్చింది..పక్కనే కూర్చుని మున్నితో పాటు ఆ లెటర్ని చదివిన ఝాన్సీ కళ్ళు ఎర్రబడ్డాయు..
మున్నీసాబేగం చాలా మంచి అమ్మాయి.ఇలాంటి లెటర్స్ ఎన్ని వచ్చినా చించేస్తుంది తప్పితే ప్రిన్సిపాల్ కి  complaint చెయ్యదు.ఝాన్సి మున్నికి classamte cum benchmate .ఝాన్సి కూడా మంచి అమ్మాయి,కాని ప్రిన్సిపాల్ కూతురు కావడంతో పొగరెక్కువ.ఇలాంటి లెటర్స్ తనకు కాకుండా ఎవరికొచ్చినా వాటిని తీసుకుని... డాడీ అంటూ ప్రిన్సిపాల్  కి అందించేది.ఇప్పుడూ అదే చేసింది.
  లవ్ లెటర్ చదివిన ప్రిన్సిపాల్ పురుషోత్తం అలియాస్ పురు గొంగళి పురుగులా ఎగిరెగిరి పడ్డాడు.వాళ్ళని వదిలేస్తే రేపు తన కూతురికే రాస్తారని భయపడ్డాడు.చర్య తీసుకోవాలంటే ముందు వాడెవడో కనిపెట్టాలి...స్క్వాడ్ బయలుదేరింది....చిన్న కాలేజ్ కావడంతో అబ్బాయిల పుస్తకాల సేకరణ పెద్ద కష్టం కాలేదు....అందరి పుస్తకాలని పరిశీలించారు.
బాల అడ్డంగా,నిలువుగా,మొత్తంగా దొరికిపోయాడు.
ఆఫీస్ రూం నుంచి బాలకి పిలుపొచ్చింది.అప్పటికే విషయం వైరస్ లా .. కాలేజ్ మొత్తం వ్యాపించింది.బాలాకి పిలుపు రావడంతో ఆ లెటర్  రాసింది బాలాయేనని అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు.M.P.C అమ్మాయిలైతే బాలాని casanova 2001 టైపులో ఊహించేసుకున్నారు.
బాలాకి విషయం అర్థమయ్యింది.గంధం శివకి భయమేసింది.వెళ్లి తన పేరు ఎక్కడ చేపుతాడోనని బాలా వైపు బేలగా  చూసాడు.
బాలా ధైర్యం చెప్పి ఎట్టి పరిస్థితుల్లో నీపేరు చెప్పానని ప్రమాణం చేసి, ప్యూను తోడు రాగా ఆఫీస్ రూంకి భయపడుతూ వెళ్ళాడు.

బాలాని అరగంటసేపు తిట్టాక అలిసిపోయి,లీటర్ మంచినీళ్ళు తాగి ..నాలుగు పచ్చి క్యారట్ ముక్కలు తిని రిలాక్సయ్యాడు పురు.
మున్నీసాని పిలిపించాడు పురు,బాలతో  సారీ చెప్పించడానికి .
మున్నీ వచ్చి బాలాకి ఎదురుగా నిలబడింది.
అప్పుడు చూసాడు బాలా మున్నీని.
వెంటనే అతని హృదయమనే సముద్రంలో ప్రేమ అలలు ఉవ్వెత్తున ఎగిసాయి.తనకి రెండడుగుల దూరంలో ఎదురుగా నిలబడి ఉన్న పాలరాతి బొమ్మని చూసి దాదాపు అతని పంచేంద్రియాలు పనిచేయడం మానేసాయి.బాలా శిలలా అలాగే నిలబడి ఆమెనే చూస్తున్నాడు.
           ఇప్పుడు ..
దాదాపు ఏడు సంవత్సరాల తరువాత ఆమెని మళ్ళీ అలాగే చూస్తూ ఉండిపోయాడు బాల.....
మున్నీ ముందుగా తేరుకుని , బాలా పరిస్థితిని చూసి జాలిపడి,భాదపడి కన్నీటిని కష్టపడి ఆపుకుని కళ్ళతోనే ధైర్యం చెప్పింది.
ఈ రోజు బాబుని నడిపిస్తారని చెప్పారు...మెల్లగా అడిగింది భానుమతమ్మ.
అవునని చెప్పి గాలిలో వ్రేలాదదీయబడి ఉన్న బాలా కాలుని నర్సు సహాయంతో బెడ్ పైకి  దింపింది మున్నీ.

ఆశ్చర్యం ఇప్పుడు బాలకి నొప్పి తెలియడం లేదు.మున్నీనే చూస్తూ ఉన్నాడు.
హృదయమనే సముద్రంలో అలలు మళ్ళీ ఇప్పుడు పైకి లేచాయి.
కళ్ళ ముందు ఉన్న మున్నీని చూస్తుంటే రెప్ప వేయలేకపోతున్నాడు బాలా.
ఒంటికి వైట్ కోట్,మేడలో స్టెతస్కోప్,అంతే... ఇంకేం మారలేదు మున్నీ.
అదే అందం.నిజం చెప్పాలంటే తన అందం ఇంకా పెరిగింది.వైట్ కోట్ లో angel లా ఉంది.
నెమ్మదిగా బాలా కాలిని కిందకి దింపింది మున్నీ.
దాదాపు ఏడురోజులు తరవాతః అతని ఎడమ కాలు నేలని తాకింది.

ఒకవైపు భానుమతమ్మ,మరోవైపు మున్నీ సాయం చేస్తుంటే ఎడమ కాలుని పైకి లేపాలని ప్రయత్నిస్తున్నాడు బాలా.
కాని అతనివల్ల కావడం లేదు.నెమ్మదిగా నొప్పి తెలుస్తుంది.ఎంత ప్రయత్నించినా అడుగు పడటంలేదు.ఇక నావల్ల కాదంటూ మున్నీ కళ్ళలోకి చూసాడు బాలా.
కార్తీకపౌర్ణమి రోజు కోనేటిలో వెలుగుతున్న దీపాల్లాంటి కళ్ళతో బాలాకి ధైర్యం చెప్పింది మున్నీ.
భారం మున్నీపై వేసి గట్టిగా దేవుణ్ణి తలుచుకుని తన ఒంట్లోని సత్తువంతా ఉపయోగించి అడుగు తీసి ముందుకు వేసాడు బాలా. భానుమతమ్మ కళ్ళలో వెలుగు.అప్పుడే వచ్చిన శివకృష్ణ కళ్ళ లో ఆనందం.
బాలా నడుస్తున్నాడు......నమ్మలేకపోతున్నాడు బాలా.కొన్ని క్షణాల క్రితం నడవలేనని నిస్పృహ పడిన బాలా ఇప్పుడు నడుస్తున్నాడు.నెమ్మదిగా అడుగు తీసి అడుగు వేస్తున్నాడు.హాస్పిటల్ కారిడార్లో మున్నీ,భానుమతి సాయంతో ఏడో అడుగు వేసిన బాలా  మున్నీ కళ్ళలోకి చూసాడు.

                                                                                                                                       ఇంకా ఉంది..


                                                                                                                                      

14 comments:

  1. super..keka...
    కార్యేషు దోషి,కరణేషుకంత్రి,భోజ్యేషుదాత,జంబలకడిపంబ.....
    very funny...

    ReplyDelete
  2. nice ra but story read chasthu unta naku oka dought came..... that was real story anepistu undhe.....

    koncham mix right.......

    but nice ra really nice
    all the best

    ReplyDelete
  3. sri..thank you..

    secrets neeku personal gaa chepthaanu..

    story real aa kaada anedi not an imp thing.

    ela undi anede imp.

    ReplyDelete
  4. too much unadhi narration ravi ...............

    ReplyDelete
  5. amazing, wonderful ..... enka konni words...
    chala bagundi...

    ReplyDelete
  6. rahul..

    thank you so much ra..
    thanks for u r encouraging words:)

    ReplyDelete
  7. baaraasaaru andi...nooru therachi muyatam marichipooyaadu anee expression baagundhi over all ga kata kooda bagundhi..!

    srujanabhajana.blogspot.com

    ReplyDelete
  8. story is goin very well for me...

    bt andarikii nachaalante punchlu perigi length taggalemo ravii..wat say??
    erojullooo janaaniki mottam chadive opika ekkada untondi..

    ReplyDelete
  9. Ravi... melodrama ekkuvaga anpinchindi naaku...kadhanam inka konchem racy ga unte baaguntundi ani naa abhipraayam.Edi emaina mallee inka emi jarugunthundi ane curiosity develop cheyyatamlo kruthakruthyudavu ayyav anukuntaa... Keep blogging... We will keep following.. Cheers..... Sunee

    ReplyDelete
  10. mamayya..

    thank you so much for your valuble suggestions,

    i will keep in mind and write better .

    ReplyDelete